1. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు( Tirumala Brahmotsavam ) ఈరోజు తో ముగియనున్నాయి.
2.రేవంత్ రెడ్డి పై ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ , చీటర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
3.టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన
గ్రామాలను సమస్యలు పరిష్కరించకుండా ప్రకారానికి ఎందుకు వస్తున్నారు అని సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం కాఫీజనవాడ గ్రామంలో ఎమ్మెల్యే మాణిక్యరావు ను పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు.
4.జగన్ పై లోకేష్ విమర్శలు

సీఎం జగన్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.సైకో జగన్ అనావృష్టి కి అన్నయ్య లాంటివాడని లోకేష్ విమర్శించారు.
5. వైసీపీపై విష్ణుకుమార్ రాజు విమర్శలు
ఏపీలో వైసీపీకి ఇదే చివరి విజయదశమి పండుగ అని బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
6.మాజీ సీఎం లేఖ రాయడం నేరమా
చంద్రబాబు ప్రజలకు లేఖ రాస్తే వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని టిడిపి నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు( Pathipati Pullarao ) విమర్శించారు.
7 .కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ముఖ్యమంత్రి

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారని సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు( Motkupalli Narasimhulu ) అన్నారు.
8.గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన
జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర టిడిపి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.పుంగనూరులో ఉత్తరాంధ్రవాసులపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అమానుష చర్యలను ఖండిస్తూ నిరసనకు దిగారు.
9.కాళేశ్వరం డ్యాం భద్రతపై కిషన్ రెడ్డి లేఖ
కాలేశ్వరం ప్రాజెక్టు లో ముఖ్య భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర శకావత్ కు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు.
10.చంద్రబాబు తో కుటుంబ సభ్యుల మూలాఖత్
టిడిపి అధినేత చంద్రబాబుతో నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు .
11.హమూన్ తుఫాన్

బంగాళాఖాతంలో హామూన్ తుఫాన్ ఏర్పడింది.ఈ రోజు సాయంత్రానికి తుఫాను బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
12.కిటకిటలాడుతున్న వేములవాడ ఆలయం
దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈరోజు విజయదశమి పురస్కరించుకుని భారీగా భక్తులు తరలివచ్చారు.
13.మంత్రి బొత్స కామెంట్స్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
14.బండి సంజయ్ విమర్శలు

మేడిగడ్డ బ్యారేజీ కొంగడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి( Bandi Sanjay Kumar ) విమర్శలు చేశారు.నదులకు నడక నేర్పిన అపర భగీరథుడు కేసీఆర్ ఎక్కడ అని వ్యంగ్యంగా విమర్శించారు.
15.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
16. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 436 అసిస్టెంట్ ( సెక్యూరిటీ ) పోస్టులను మూడేళ్ల కాల వ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
17.హుస్సేన్ సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ కాంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
18.నేడు టిడిపి జనసేన జేఏసీ సమావేశం

నేడు టిడిపి జనసేన పార్టీలో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రిలోని హోటల్ మంజీరా లో ప్రారంభమైంది.
19.మేడిగడ్డ బ్యారేజీ పై ఎల్ అండ్ టి ప్రకటన
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2019లో ఎలాంటి 1.632 కిలోమీటర్ల పొడవైన మేడిగడ్డ బ్యారేజ్ అని నిర్మించింది.అప్పటినుంచి ఇది బాగానే పనిచేస్తుందని, 2023 సీజన్ తో సహా గత ఐదు సంవత్సరాలు వరకు అనేక వరదలను ఈ బ్యారేజ్ తట్టుకుందని , దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నష్టాన్ని అంచనా వేస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది.
20.సినీ పెద్దలపై ప్రకాష్ రాజ్ విమర్శలు

టాలీవుడ్ లో పలువురికి జాతి అవార్డులు దక్కడం తెలుగు వారందరూ గర్వించాల్సిన విషయంగా ప్రకాష్ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు.జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదని ప్రకాష్ రాజ్ నిలదీశారు.