చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....

చిప్స్, జంక్ ఫుడ్ నచ్చని వారెవరుంటారు చెప్పండి.ఊబకాయం సమస్యకి భయపడి కొంచెం దూరం పెడతారేమో కానీ… ఎక్కువ శాతం మంది చూడగానే టెంప్ట్ అయి తినేస్తుంటారు.

 Mother Blames Hot Chips After Daughters Gallbladder Had To Be Removed-TeluguStop.com

పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినే హాట్ చిప్స్ వలన ఊబకాయమే కాదు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుసినా పట్టించుకోనట్టే ఉంటాం.కాని ఇది చదివాక ఒకసారి ఆలోచించండి.

అమెరికాలోని టెన్నెస్సికి చెందిన పదిహేడేళ్ల రీనే క్రెయిగ్‌హెడ్ అనే అమ్మాయికి చిప్స్ అంటే విపరీతమైన ఇష్టం.ఎంత ఇష్టం అంటే వారానికి నాలుగు భారీ చిప్స్ ప్యాకెట్ల చొప్పున లాగించేసేంత.కొద్ది రోజుల తర్వాత ఆమెకు భరించలేనంతగా కడుపు నొప్పి వచ్చింది.నొప్పితో విలవిల్లాడుతున్న రీనేను ఆమె తల్లి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విన్న తర్వాత రీనే వాళ్ల అమ్మ షాక్ అయింది.స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల ఆమెకు ఉదర సంబంధ సమస్యలు తలెత్తాయని చెప్పారు డాక్టర్లు.

అంతేకాదు వెంటనే ఆపరేషన్ చేసి పిత్తాశయం (గాల్ బ్లాడర్) తొలగించాలన్నారు .ఇంత చిన్న వయసులో పిత్తాశయ సమస్యలు వచ్చిన వారిని చూడటం ఇదే తొలిసారని ఆమెను పరీక్షించిన డాక్టర్ తెలిపారు.

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి కారణం శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ .స్పైసీ చిప్స్ లాంటి ఆహారంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధిక మొత్తంలో ఉంటాయి.నోరూరించే ప్రతిదాన్న కడుపులో పడేస్తుంటే మనమే పెద్ద సమస్యల్లో పడిపోతుంటాం.కాబట్టి కొన్నిసార్లు నోరు కట్టేసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube