తులసి మొక్కను ఇలా పూజిస్తే ధనవంతులు అవుతారా..

మన భారతదేశంలో చాలామంది ఇంట్లో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు.అలా చేయడం వల్ల ఆ ఇంట్లో నీ వారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారని చాలామంది ప్రజల్లో నమ్ముతారు.

 Will You Become Rich If You Worship Tulsi Plant Like This , Tulsi Plant, India,-TeluguStop.com

ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో వారు ప్రతి పనిలో విజయం సాధించి డబ్బును పొందుతారని చెబుతారు.తులసి మొక్క తల్లి లక్ష్మి రూపంగా కనిపిస్తోంది.

తులసి మొక్కతోనే కాకుండా వేర్లతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

తులసి మొక్కను పూజించడం, నీరు పోయడం విష్ణుకు తులసి దళాన్ని సమర్పించడం, వల్ల ఇంట్లో నీ కుటుంబ సభ్యులందరూ తల్లి లక్ష్మీ అనుగ్రహం వల్ల సుఖసంతోషాలతో ఉంటారు.

మీరు ఏదైనా పనిలో ఎప్పుడూ విఫలమౌతూ ఉంటే రెండు లేదా మూడు తులసి మొక్క వేర్లను గంగాజలంతో కడిగి, ఆచారం ప్రకారం పూజ చేసిన తర్వాత పసుపు రంగు కట్టి మీ దగ్గర ఉన్న పవిత్రమైన చోట ఉంచుకోండి.ఇలా చేయడం వల్ల ఏ పనిలో అయినా విజయం వరిస్తుంది.

మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు, ఆదాయం పెరగాలంటే ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు పోయాలి.అలాగే సాయంత్రం పూట దీపం వెలిగించాలి.అయితే వీటితోపాటు శుక్రవారం నాడు మెడలో తులసి మూలాలను వెండి హారతిలో వేసి ఉంచాలి.

కొంతమంది ప్రజల జాతకంలో ఉన్న గ్రహాలు జీవితంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటే తులసి మొక్కను పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.తులసి మొక్క వేర్లను ఎర్ర రంగు గుడ్డలో కట్టి వెండి తాయత్తును ధరించాలి.ఇంకా చెప్పాలంటే ఇల్లు లేదా ఆఫీస్ నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి తులసి వేర్లను ఒక దండగ తయారు చేసి ఆఫీస్ టేబుల్ పై ఉంచండి.

ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఆఫీసు లేదా ఇంట్లోకి రాకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube