ఆ వినాయకుడుకి మూడు కళ్లున్నాయంటా.. ఎక్కడో తెలుసా?

రాజస్థాన్‌లోని సవాయ్‌మాధోపూర్‌లోని రణ తంబోర్‌ పులుల అభయారణ్యం మధ్యలో. మూడు కళ్లు కల్గిన వినాయకుడి విగ్రహం ఉందంట.

 అయితే ఈ వినాడకుడిని ఏ కోరిక కోరుకున్నా తీరుతుందనేది అక్కడి భక్తుల నమ్మకం. అయితే భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్.

 అందేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ త్రినేత్ర వినాయకుడికి తమ సమస్యలను తెలుపుతూ.

 ఆ కష్టాలను తీర్చమని వేడుకుంటూ భక్తులు ఉత్తరాలు రాస్తారట. అలా చేస్తే.

Advertisement

 కచ్చితంగా ఆ సమస్యలు తీరిపోతాయట. జైపూర్‌ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని సవాయ్‌ మాధోపూర్‌ జిల్లా రణతంబోర్‌ కోటలో ఉందీ మహిమాన్విత క్షేత్రం.

 ఆరావళి, వింధ్య పర్వతాలు కలిసేచోట 1580 అడుగుల ఎత్తులో కొలువు దీరింది.అయితే ఈ మూడు కళ్ల వినాయకుడు స్వయం భువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.

 స్వామి వారు వెనక ఉన్న కొండ నుంచి ఉద్భవించారట. ఆయన ఇద్దరు భార్యలు బుద్ధి, సిద్ధి, కుమారులు శుభ్‌, లాభ్‌ విగ్రహాలను కూడా ఈ ఆలయంలో నెలకొల్పారు.

 వెయ్యేళ్ల చరిత్ర కల్గిన ఈ గణేషుడికి మూడు కళ్లు ఉండటమే కాక ఉత్తరాలు కూడా రాయడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే సంతానం, ఉద్యోగం, పదోన్నతి, వ్యాపారం, ఇంట్లో గొడవలు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

 ఇలా మరెన్నో చింతలు తీర్చమని త్రినేత్ర గణేశుడిని భక్తులు వేడుకుంటారు. వారి మనస్సుల్లో కోరుకున్న అన్నింటినీ ఆ గణ నాథుడు పూర్తి చేస్తాడట.

Advertisement

 త్రినేత్ర గణేశ్‌ దర్శన భాగ్యంతోనే ప్రపంచంలోని అన్ని సమస్యలు దూరమై పోతాయని భక్తుల ప్రగాఢ విశ్యాసం. మీకూ వెళ్లాలనిపిస్తోందా.

 అయితే రాజస్థాన్ వెళ్లాల్సిందే.

తాజా వార్తలు