హిందూమతంలో చాలా ఆచారాలు ఉంటాయి.ఇందులో 16 సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు.
అయితే పుట్టుక నుండి అంత్యక్రియల వరకు జరిగే ప్రతి ముఖ్యమైన సంస్కారాలు కూడా మొత్తం 16 అని చెబుతారు.అలాగే ఇందులో ఆఖరి సంస్కారం అంత్యక్రియలు.
( Cremation ) ఇక మొదటి సంస్కారం నుంచి 15 సంవత్సరాల వరకు ప్రతి దాంట్లోనూ కూడా స్త్రీలు ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు.అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
కానీ అంత్యక్రియలకు మాత్రం స్మశాన వాటికకు పురుషులు మాత్రమే వెళ్తారు.స్త్రీలను అక్కడికి అనుమతించరు.
ఇది ఎందుకు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది.అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు.

అయితే ఈ మధ్యకాలంలో పురుషులతో పాటు స్త్రీలు ( Women ) కూడా స్మశానానికి వెళుతున్నారు.మగపిల్లలు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.కానీ హిందూ ధర్మం ప్రకారం స్త్రీలను స్మశాన వాటికల్లోకి( Cremation Ground ) అనుమతించకూడదు.దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.పురుషులకన్నా స్త్రీల మనసు సున్నితమైనది.బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే, స్త్రీలు మాత్రం ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు.
ఒక వ్యక్తి చనిపోయిన సమయంలో ఏడుస్తూ ఉంటారు.అయితే శరీరాన్ని స్మశానానికి తీసుకు వెళ్లిన తర్వాత కూడా మహిళలు అక్కడికి వచ్చి రోదిస్తే ఆత్మకు శాంతి కలగదు.
ఆ ఆత్మలు ఏడుపు విని ఈ రోదిస్తాయట.

అలాగే చనిపోయిన వ్యక్తి చితిని తగలబెట్టినప్పుడు ఎముకలు నలిపే శబ్దం వస్తుంది.ఈ శబ్దాలకు మహిళలు, పిల్లలు భయపడతారు.అందుకే స్త్రీలు స్మశాన వాటికకు రాకపోవడమే మంచిది.
హిందూ విశ్వాసాల ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని పురుషులు తన వారుపోయిన సమయంలో కర్మలు చేసినప్పుడు గుండు చేయించుకుంటారు.అందుకే మహిళలు అంత్యక్రియలు చేయకూడదని చెబుతారు.స్మశాన వాటికలో దహన సంస్కరాలు చేసిన తర్వాత కొన్ని ఆత్మలకు శాంతి లభిస్తుంది.అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి.
అలాంటి ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయి.అందుకే స్త్రీలను స్మశానంలోకి అనుమతించరు.