ఉప్పు డబ్బాలో ఈ వస్తువులను ఉంచితే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే..

ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది.డబ్బు ఉంటేనే ఈ సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి.

 If You Keep These Things In A Salt Box Goddess Lakshmis Grace Is Upon You ,salt-TeluguStop.com

అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి రాత్రి అనక పగలనకా కష్టపడుతున్నారు.అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసిన కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతు ఉంటుంది.

దీనివల్ల తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి.

అయితే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.

అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా కొన్ని నియమాలు పాటించడం వల్ల కూడా ఆ దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అవ్వడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు.

అందువల్ల ఆ రోజుల్లో ఒక మట్టి జాడిని తీసుకొని లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి.ఆ తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొత్త పసుపు వస్త్రాన్ని ఉంచాలి.ఆ తర్వాత వస్త్రం పై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మను వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణేన్ని ఉంచి మూట కట్టాలి.

తర్వాత ఆ మూటను మట్టి జాడీలో అడుగు బాగానే ఉంచి, దాని పై రాళ్ల ఉప్పును పోయాలి.

ఈ విధంగా మట్టి జాడీలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో కూడా ఉపయోగించవచ్చు.ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అయిపోయి ధనవంతులవుతారు.

ఒకవేళ బంగారు, వెండితో తయారు చేసిన ఉంగరాలు, నాణేలు లేకపోతే ఒక చిన్న ముక్క బంగారాన్ని అందులో వేసి ముడి వేయడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి.ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దవారు చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube