శ్రీకృష్ణుడి దేవాలయంలో బంగారం వెండి నిల్వలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయం గురు వాయురు కృష్ణ దేవాలయం ఈ దేవాలయంలో దాదాపు 264 కిలోల బంగారం, 6605 కిలోల వెండి ఉన్నట్లు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.1737 కోట్లు ఇటీవల దేవస్థానం ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేయబడినట్లు సమాచారం.ఈ మెరకు ఆలయ నిర్వాహక మండలి సమాచార హక్కు కింద బంగారం, వెండి సమాచారాన్ని వెల్లడించారు.దీనివల్ల దేవాలయ పరిధిలో 138 కోట్ల బంగారం, 49 కోట్ల విలువైన వెండి ఉన్నట్లు తెలిసింది.

 You Will Be Surprised To Know The Gold And Silver Reserves In Lord Krishnas Temp-TeluguStop.com
Telugu Bhakti, Devotional, Gold Silver, Guruvayuru, Kerala, Lordkrishna, Temple-

సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు బోర్డు సమాధానం చెబుతూ విలువైన రత్నాలు, బంగారు నాణాలు, 20వేల బంగారు పతకాలు మొత్తం 264 కిలోల బంగారం నిల్వ ఉన్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.

ఇది కాకుండా దేవాలయం సమీపంలో 6605 కిలోల వెండి నాణేలు 5359 వెండి నీల్వాలు ఉన్నాయని వెల్లడించారు.స్థానిక నివాసి ప్రాపర్ ఛానల్ సంస్థ అధ్యక్షుడు ఎంకే హరిదాస్ ఆర్టిఐ ద్వారా దేవాలయ ఆస్తుల గురించి ప్రశ్నించారు.దేవాలయ అభివృద్ధి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో గురువాయూరు దేవస్థానం బోర్డు నిర్లక్ష్యం వహిస్తున్నందున పార్టీ ద్వారా అడిగానని హరిదాసు వెల్లడించారు.

Telugu Bhakti, Devotional, Gold Silver, Guruvayuru, Kerala, Lordkrishna, Temple-

అయితే భద్రతా కారణాల దృష్ట దేవాలయానికి సంబంధించిన బంగారం, వెండి ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిర్వాహక బోర్డ్ గతంలో నిరాకరించినట్లు సమాచారం.డిసెంబర్లో దాఖలు చేసిన ఆర్టిఐ దరఖాస్తు కారణంగా దేవాలయం వద్ద 1737 కోట్ల బ్యాంకు డిపాజిట్, 271 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అందులో భూమి విలువను తెలుపలేదు.ఇది కూడా తిరుమల తిరుపతి ఆలయ కమిటీ తిమ్మప్ప దగ్గర 5300 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లు సమాచారం.15938 కోట్ల విలువైన నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థిరాస్తులు కలిపి 2.26 లక్షల కోట్ల ఆస్తి ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube