వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది.వేసవి వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తూ చిరు జల్లులు సందడి చేస్తున్నాయి.
అయితే ఈ వర్షాకాలం మనసుకు ఆహ్లాదకరంగా అనిపించినా.ఒంటికి మాత్రం ముప్పును పెంచుతుంది.
ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధి కారక జీవులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.ఫలితంగా సీజనల్ వ్యాధులు మరియు వైరల్ జ్వరాల బారిన పడే అవకాశాలు భారీగా పెరిగిపోతాయి.
అందువల్ల వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే వర్షాకాలం( Monsoon )లో తెలిసో తెలియకో కొందరు పెరుగును దూరం పెడుతూ ఉంటారు.ఈ సీజన్ లో పెరుగు తింటే జలుబు చేస్తుందని భావిస్తుంటారు.
అలాంటివారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.పెరుగు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో ఒకటి.
ఏ సీజన్ లో అయినా పెరుగును తీసుకోవచ్చు.జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని దూరం పెడితే చాలా ప్రయోజనాలను కోల్పోతారు.
వాస్తవానికి పెరుగు( Curd )లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.ఇది మనం మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో మరియు రోగ నిరోధక శక్తిని బలపరచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.బలమైన రోగనిరోధక వ్యవస్థ సీజనల్ గా వచ్చే వ్యాధులతో పోరాటానికి తోడ్పడుతుంది.అలాగే పెరుగులో ఉండే కాల్షియం మరియు ఫాస్పరస్ దృఢమైన ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి సహకరిస్తాయి.
పెరుగులో మెండుగా ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను క్లియర్ చేస్తాయి.మన గట్ యాక్టివిటీని మెరుగుపరుస్తాయి.
మరియు మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పికి చికిత్స చేయడంలో పెరుగు గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
అంతేకాదండోయ్.పెరుగులో ఉండే పలు పోషకాలు మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి.
ఆడవారు నెలసరి సమయంలో పెరుగును తప్పకుండా తీసుకోవాలి.ఎందుకంటే పెరుగు శరీరానికి శక్తిని అందిస్తుంది.
నీరసాన్ని దూరం చేస్తుంది.ఇక వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారు పెరుగును అవైడ్ చేస్తుంటారు.
కానీ పెరుగును డైట్ లో చేర్చుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.