ఫూల్ మఖానా. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
తామర గింజలనే ఫూల్ మఖానా అంటారు.చాలా మంది వీటిని స్నాక్స్ గా తింటుంటారు.
అలాగే వీటితో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.ధర తక్కువే అయినా ఫూల్ మఖానా లో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.
ముఖ్యంగా వీటితో ఇప్పుడు చెప్పబోయే విధంగా మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మఖానా మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా ( Phool makhana )వేసుకోవాలి.అలాగే పది బాదం పప్పులు( Almonds ) పది పిస్తా పప్పులు, ఐదు జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న పదార్థాలను వేసుకోవాలి.అలాగే ఒక అరటిపండు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి మరియు ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే మన మఖానా మిల్క్ షేక్ సిద్ధం అయినట్లే.
వారంలో కనీసం రెండు సార్లు ఈ మిల్క్ షేక్( Milkshake ) ను తీసుకున్నా ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.నిద్రలేమి బాధితులకు ఈ మిల్క్ షేక్ న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.మఖానా లో ఉండే పలు పోషకాలు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.
నిద్రలేమిని దూరం చేస్తాయి.అలాగే ఈ మిల్క్ షేక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకలు కండరాలు పుష్టిగా మారతాయి.
ఈ మఖానా మిల్క్ షేక్ రక్తహీనతకు అడ్డుకట్ట వేస్తుంది.అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది.శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది.ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ అవుతుంది.
పైగా ఈ మఖానా మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దీని కారణంగా చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.
ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.పిల్లలకు, గర్భిణీలకు కూడా ఈ మిల్క్ షేక్ ఎంతో మేలు చేస్తుంది.