వ‌న్ వీక్‌లో స్కిన్ టోన్ పెర‌గాలా? అయితే ఈ రెమెడీ ట్రై చేయండి!

ఏదైనా పెళ్లి లేదా ఫంక్ష‌న్ వ‌స్తోందంటే.ఎక్క‌డ్లేని కేరింగ్ అంతా చ‌ర్మంపైనే వ‌చ్చేస్తుంది.

 Best And Effective Home Remedy For Improving Skin Tone! Skin Tone, Home Remedy,-TeluguStop.com

ముఖ్యంగా స్కిన్ టోన్‌ను పెంచుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.స్కిన్ వైట‌నింగ్ క్రీములు, ర‌క‌ర‌కాల ఫేస్ ప్యాకులు, మాస్కులు వాడుతుంటారు.

కొంద‌రైతే బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి ఏవేవో ఫేసియ‌ల్స్ చేయించు కుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే గ‌నుక కేవ‌లం వ‌న్ వీక్‌లోనే స్కిన్ టోన్ మెరుగు ప‌డుతుంది.

పైగా ఈ రెమెడీ కోసం వేల‌కు వేలు ఖర్చు పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక గుమ్మ‌డి కాయ‌ను తీసుకుని పై తొక్క మ‌రియు లోప‌ల ఉన్న గింజ‌ల‌ను తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ గుమ్మ‌డి ముక్క‌ల‌ను ఎండ‌లో బాగా ఎండ బెట్టుకుని.

మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల గుమ్మ‌డి కాయ పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల బంగాళ‌దుంప ర‌సం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్ని మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం వేళ్ల‌తో ముఖాన్ని స్మూత్‌గా ర‌బ్ చేసుకుంటూ నార్మ‌ల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక వారంలో రోజుల్లోనే మీ స్కిన్ క‌ల‌ర్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కాబ‌ట్టి, ఇక‌పై బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్లి డ‌బ్బులు వేస్ట్ చేసే బ‌దులు ఇంట్లోనే ఈ న్యాచుర‌ల్ రెమెడీని ట్రై చేస్తే మంచి ఫ‌లితాన్ని పొందొచ్చు.

Best And Effective Home Remedy For Improving Skin Tone Skin Tone

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube