కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) త్వరలోనే డిజాస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.అయితే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకుంటున్న తరుణంలో ఆయనతో సినిమా ఎందుకు కమిట్ అయ్యారు అంటూ చాలామంది హీరో విజయ్ సేతుపతికి ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారట.
ఇలా తనకు వచ్చిన ఈ కామెంట్లపై విజయ్ సేతుపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.పూరి జగన్నాథ్ తో తాను చేసే సినిమా జూన్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.అయితే నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యాను అంటే ఆ స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తాను.
అలాకాకుండా ఆ డైరెక్టర్స్ ముందు సినిమాలు హిట్ అయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా అనే వాటి ఆధారంగా సినిమాని ఎప్పుడు జడ్జ్ చేయనని, కథ నచ్చితేనే నటిస్తానని తెలిపారు.

పూరి జగన్నాథ్ నాకు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది.ఇప్పటివరకు నేను అలాంటి కథతో సినిమాలు చేయలేదు.నేనెప్పుడూ కూడా కొత్త తరహా పాత్రలలో నటించడానికి ఇష్టపడతాను.
ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో నా పాత్రలు రిపీట్ కాలేదని వెల్లడించారు.ఇక ఇప్పటివరకు నేను నటించిన నా సినిమాలలో నాకు మహారాజ సినిమా చాలా ప్రత్యేకమైనదని తెలిపారు.
ఇక ఈ సినిమాలో టబు( Tabu ) నటించడం గురించి కూడా విజయ్ సేతుపతి మాట్లాడుతూ… ఆమె ఒక గొప్ప నటి ఇప్పటివరకు తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు.ఆమెతో కలిసిన నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.