పెరుగులో ఎండుద్రాక్ష క‌లిపి తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?

పెరుగు,( Curd ) ఎండుద్రాక్ష‌.( Raisin ) ఇవి రెండు సంబంధం లేని ఆహారాలు.విడివిడిగా వీటి రుచి.ఇవి అందించి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ తెలుసు.కానీ, పెరుగు మరియు ఎండుద్రాక్ష‌ను క‌లిపి తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చో తెలుసుకుంటే క‌చ్చితంగా ఆశ్య‌ర్య‌పోతారు.పెరుగు, ఎండుద్రాక్ష ఒక వండ‌ర్‌ఫుల్ ఫుడ్ కాంబినేష‌న్‌.

 Health Benefits Of Eating Raisins With Yogurt Details, Yogurt, Raisins, Raisins-TeluguStop.com

ఒక క‌ప్పు పెరుగులో ప‌ది వ‌ర‌కు ఎండుద్రాక్ష‌ల‌ను గంట పాటు నాన‌బెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.హెల్త్ ప‌రంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇమ్యూనిటీని( Immunity ) బలోపేతం చేయ‌డంలో పెరుగు, ఎందుద్రాక్ష కాంబినేష‌న్ బాగా స‌హాయ‌ప‌డుతుంది.పెరుగులోని గుడ్‌ బ్యాక్టీరియా శరీర రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.ఎండుద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.అలాగే పెరుగులోని ప్రొబయాటిక్స్ జీర్ణవ్యవస్థను శక్తివంతంగా మారుస్తాయి.

ఎండుద్రాక్షలో మెండు ఉండే ఫైబర్ కంటెంట్ ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల‌కు చెక్ పెడుతుంది.

Telugu Curd, Fatigue, Tips, Immunity, Latest, Raisins, Yogurt, Yogurt Benefits-T

పెరుగు, ఎండుద్రాక్ష కాంబినేష‌న్ అనేది ఒక శక్తివంతమైన ఆహారం.ఎందుకంటే, పెరుగు మ‌రియు ఎండుద్రాక్ష శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని( Instant Energy ) అందిస్తాయి.నీర‌సం, అల‌స‌ట‌ను( Fatigue ) వేగంగా దూరం చేస్తాయి.

బ‌రువు త‌గ్గాల‌ని( Weight Loss ) భావించేవారు కూడా పెరుగు, ఎండుద్రాక్ష‌ను క‌లిపి తినొచ్చు.ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల తక్కువగా తిన్నా పొట్టు తృప్తిగా అనిపిస్తుంది.

అధికాహారం తీసుకోవకుండా నియంత్రణలో స‌హాయ‌ప‌డుతుంది.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Curd, Fatigue, Tips, Immunity, Latest, Raisins, Yogurt, Yogurt Benefits-T

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి.నిత్యం ఒక క‌ప్పు పెరుగులో ఎండుద్రాక్ష క‌లిపి తింటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.అంతేకాకుండా పెరుగు మ‌రియు ఎండు ద్రాక్ష‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇత‌ర పోష‌కాలు చర్మం మెరిసేలా చేస్తాయి.చ‌ర్మానికి స‌హ‌జ తేమ‌ను అందిస్తాయి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు, ఎండుద్రాక్ష‌ను క‌లిపి తీసుకుంటే ఉత్త‌మ ఫ‌లితాలు పొందుతారు.లేదా వర్కౌట్ తర్వాత కూడా తీసుకోవ‌చ్చు.

తిన్న వెంట‌నే నీళ్లు తాగకూడ‌దు.క‌నీసం 15-30 నిమిషాలైనా వేచి ఉండాలి.

లేదంటే కొన్నిసార్లు జీర్ణ సమస్యలు త‌లెత్త‌వ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube