ఎండలు మండిపడుతున్నాయి.వేసవి వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.
అయితే ఈ సీజన్ లో కడుపుకు చల్లగా.ఆరోగ్యానికి అండగా నిలవడంతో కర్బూజ జ్యూస్( Muskmelon Juice ) ముందుంటుంది.
వేసవి కాలంలో విరివిగా లభ్యమయ్యే కర్బూజ పండులో సుమారు 90 శాతం వరకు నీరు ఉంటుంది.అదేవిధంగా తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
అందువల్ల రోజుకు ఒక గ్లాస్ కర్బూజ జ్యూస్ తాగితే మస్తు బెనిఫిట్స్ పొందుతారు.
కర్బూజ పండు శరీరాన్ని చల్లగా ఉంచే గుణం కలిగి ఉంటుంది.
వేసవి రోజుల్లో కర్బూజ జ్యూస్ తాగడం వల్ల హీట్ స్ట్రోక్( Heat Stroke ) నుంచి రక్షణ లభిస్తుంది.పైన చెప్పుకున్నట్లు కర్బూజలో నీటి శాతం చాలా ఎక్కువ.
అందువల్ల ఈ పండుతో హెల్తీగా జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే శరీరాన్ని తేమగా ఉంచుతుంది.తద్వారా డీహైడ్రేషన్( Dehydration ) బారిన పడే అవకాశాలు తగ్గుముఖం పడతాయి.

సమ్మర్ సీజన్ లో కొందరు గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.అయితే కర్బూజ జ్యూస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.ఆయా జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.కర్బూజ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల హై బీపీ ఉన్నవారికి కర్బూజ జ్యూస్ సూపర్ డ్రింక్ అవుతుంది.ఇది రక్తపోటును అదుపులోకి తేవడంలో తోడ్పడుతుంది.

అంతేకాదండోయ్.కర్బూజ జ్యూస్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బరువు తగ్గడంలో సహాయపడుతుంది.మరియు చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది.కాబట్టి, సమ్మర్ లో కర్బూజ జ్యూస్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.ఈ జ్యూస్ ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.
అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పీల్ తొలగించిన కర్బూజ పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు మరియు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేశారంటే టేస్టీ అండ్ హెల్తీ కర్బూజ జ్యూస్ రెడీ అవుతుంది.
ఒకవేళ స్వీట్ నెస్ కోసం బెల్లం, ఖర్జూరంకు బదులు తేనెను యాడ్ చేసుకోవచ్చు.షుగర్ ను మాత్రం పూర్తిగా స్కిప్ చేయండి.







