మన హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది.అయితే ప్రతి నెలలో రెండు ఏకాదశిలో ఉంటాయి.
వీటిలో మొదటిది శుక్లపక్షం.అలాగే రెండవది కృష్ణపక్షం.
జేష్ట మాసం( Jyaistha )లో వచ్చే శుక్లపక్ష ఏకాదశినీ నిర్జల ఏకాదశి( Nirjala Ekadashi ) అని అంటారు.అయితే ఈ ఏకాదశికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
దీన్ని ఆచరించడం వలన మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలకు విముక్తి లభిస్తుంది.అయితే ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి 31వ తేదీన మే 2023 అంటే బుధవారం నాడు వస్తోంది.
ఈ ఏడాది పొడవైన ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోతే లేదా ఒక్క నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోతే విష్ణుమూర్తి మీ బాధలన్నింటిని కూడా దూరం చేస్తాడని అందరూ నమ్ముతారు.అయితే నిర్జల ఏకాదశి రోజున ఆహారం అలాగే నీరు రెండు కూడా త్యాగం చేయాలి.
అప్పుడే ఈ ఉపవాసం కచ్చితంగా విజయవంతం అవుతుంది.అయితే ఈ ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ వ్రతం ఆచరించడం వలన సర్వపాపాల నుండి మనకు విముక్తి లభిస్తుంది.అయితే ఆ రోజు శుభముహూర్తాలు ఉన్నాయి.

ఏకాదశి తిధి మే 30వ తేదీన మధ్యాహ్నం 1:32 గంటలకు ప్రారంభమవుతుంది.ఆ తర్వాత ఏకాదశి తిధి మే 31వ తేదీన మధ్యాహ్నం 1:36 గంటలకు శుభ ముహూర్తం ముగుస్తుంది.ఇక ఉదయ తిథి కారణంగా మే 31వ తేదీన ఏకాదశి తిధి ఉపవాసం ఉంటుంది.ఇక జూన్ 1 2023న అంటే గురువారం నాడు ఉపవాసం పాటించాలి.
అయితే దీనికి శుభ సమయం ఉదయం 5:24 నుండి 8:10 వరకు ఉంటుంది.

అందుకే ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచాక తల స్నానం చేసి మొదలైన పనులు ప్రారంబించాలి.ఇక విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి.తులసి ఆకులు లేకుండా పూజ అసంపూర్ణంగా ఉంటుంది.
అంతేకాకుండా దేవుడికి పసుపును కూడా సమర్పించాలి.ఇక నిర్జల ఏకాదశి నాడు దానానికి చాలా విశేష ప్రాధాన్యత ఉంది.
అందుకే ఆరోజు దానం( Donation ) చేయడం వలన భగవంతుని విశేషాలు మనకు లభిస్తాయి.