భీమానదీ ప్రాశస్త్యము వివరించండి?

ఈ భీమా నదినే భీమరది అని తామ్రపర్ణ అని పిలుస్తారు.పశ్చిమ కనుమల్లో సహ్యపర్వత వరుసలో ఈ భీమానది ఉద్భవించినది.

 Importance And Story Of Bheema River Bheema River , Importance , Story-TeluguStop.com

ఈ నది ప్రస్తావన మత్స, బ్రహ్మ, వామన, బ్రహ్మాండ, శివ, వాయు, కూర్మ పురాణాల్లో రామాయణ భారతాల్లో వివరించబడింది.ఈ బీమానదికి పెక్కు ఉప నదులు ఉన్నాయి.

భీమ శంకర్ క్షేత్రము ప్రక్కన భీమగిరి అను సన్నని లోయ గుండా ప్రవహించి, పింపరీగామ్ వద్దచేరి, అక్కడ “భామ” అను చిన్న నదిని తనలో కలుపుకొనుచున్నది.బీమా నదిలో కలిసే మరొక ఉపనది.

ఈ ఇంద్రాణి దేహు అను గ్రామం గుండా ప్రవహిస్తుంది.ఈ గ్రామంలోనే కవి భక్త తుకారాం జన్మించింది.

అక్కడ నుంచి తులాపూర్ వద్ద భీమా నదిలో ఇంద్రాణి కలుస్తుంది.ధాంథేరిడ్ను ప్రాంతానికి కొద్ది దూరంలో “తేల్” అను మరొక నది భీమా నదిలో కలుస్తుంది.

తర్వాత “మాలా ముధా” అను ప్రవాహం కలుస్తుంది. గోల్ అను చిన్న నది భీమాలో కలుస్తుంది.

భీమానది ఆగ్నేయ దిశగా ప్రవహిస్తూ ముందుకు సాగి, నరసింగూర్ వీరా అను మరొక నదితో సంగమిస్తుంది.

ఇక్కడ నుండి మరికొంత దూరం ప్రవహించి ప పండరీపురం చేరుతుంది.

అక్కడ ఈ నది చంద్ర భాగానదీ అని పిలుస్తారు.ఇక్కడ పాండురంగ స్వామి (విఠలీ) అనే ప్రసిద్ధ క్షేత్రం ఉంది.

ఇక్కడున్న 11 స్నాన ఘాట్టలు అత్యంత పుణ్య ప్రదమైనవి.ఇక్కడ నుండి భీమానది ఆగ్నేయంగా 10 మైళ్లు ప్రవహించి, స్కారలి వద్ద 25 మైళ్ళ నది కలుపుకొని షోలాపూర్కు దక్షిణంగా ప్రవహించి, కుమలీ అనే ప్రాంతం వద్ద సేనా అను చిన్ననది తనలో కలుపుకొని చివరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కు ఉత్తరములోని మహబూబ్ నగర్ సరిహద్దులో కృష్ణారైల్వే స్టేషన్ వద్ద కీష్ణానదికి ఉప నదిగా మారినది.

కుంభకర్ణుని రెండవ భార్య “కర్కటి”జన్మించిన భాముడనే రాక్షస సంహారం చేసిన ఈశ్వరుడు “భీమశంకర్ జ్యోతిర్లింగంగా వెలిశాడు.ఈ లింగము క్రింద నుంచి ఊరిన నీరు భీమానదీ జన్మ స్థానముగా మారినది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube