ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:
ఉదయం 6.10
సూర్యాస్తమయం:
సాయంత్రం.5.58
రాహుకాలం:
మ.1.30 ల3.00
అమృత ఘడియలు:
ఉ.8.00 ల10.00 మ3.40 సా4.10
దుర్ముహూర్తం:
ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
మేషం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
వృషభం:
ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి వారి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
తుల:
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.అధికారులు లేదా పెద్దలను తెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ధనుస్సు:
ఈరోజు మీరు పరిస్థితులకు అనుకూలంగా ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సోదరులతో చర్చలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
మకరం:
ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
వారు కాస్త ధైర్యం ఇస్తారు.పిల్లల భవిష్యత్తు గురించిఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు
కుంభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.
కానీ భవిష్యత్తులో కొన్ని సమస్యలు వస్తాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
DEVOTIONAL