ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 06.49
రాహుకాలం:మ .12.00 ల1.30
అమృత ఘడియలు:ఉ.7.40 ల9.40 సా.4.00 ల.6.00
దుర్ముహూర్తం:ఉ .11.57 సా.4.11
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.మీ ఇంట్లో శుభకార్యం చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బులు మీ చేతికందుతుంది.స్నేహితుల ద్వారా కొన్ని పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీకు తొందరపాటు పనికిరాదు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:

ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.అక్కడ ఒక శుభవార్త మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది.కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త వ్యాపారాల గురించి అక్కడ మీ బంధువుల తో చర్చలు చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మరిన్ని బాధ్యతలు ఉంటాయి.మీరు చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.
సింహం:

ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ఎప్పటి నుంచో నిలిపివేయిపడ్డ పనులు ఈరోజుతో పూర్తవుతాయి.మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.
కన్య:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.
స్నేహితుల ద్వారా కొన్ని నిలిపివేయబడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తులా:

ఈ రోజు మీరు దైవదర్శనం చేసుకుంటారు.ఆత్మీయుల నుండి ఒక శుభవార్త వింటారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పనైనా మొదలు పెట్టే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొంటారు.ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ధనస్సు:

ఈరోజు మీకు కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి.భార్యాభర్తల మధ్యన కలహాలు మొదలవుతాయి.ఇంటి నిర్మూలన గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.మీ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మకరం:

ఈరోజు మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీరు నమ్మిన వాళ్లు మీకు ద్రోహం చేస్తారు.ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.స్నేహితుల ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
కుంభం:

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
మీ అభిమానులు మీకు గొప్ప బహుమతులు ఇస్తారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.
మీనం:

ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితుల నుండి బయట పడతారు.ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.మీరు చేసే వ్యాపారం లో సరైన పెట్టుబడి పెట్టగలుగుతారు.వ్యాపారానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు.