గత ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ భారత్‌కు ఘోర పరాభవం మిగిల్చింది.వెంటనే తేరుకున్న భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబర్చి 2-1తో ఆధిక్యాన్ని పొందింది.
అయితే ఆటగాళ్లకు కరోనా రావడంతో చివరి టెస్టు వాయిదా పడింది.ఆ మిగిలిన టెస్టు ఆడేందుకు ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌కు వెళ్లింది.
జూన్ 1న జరిగే ఈ మ్యాచ్‌కు ఇంకా చాలా రోజులు ఉండడంతో ముందుగానే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు లండన్‌లో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు.దీంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలకు వార్నింగ్ ఇచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్ కోవిడ్ పాజిటివ్‌గా రావడంతో అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు.ప్రస్తుతం కోలుకుంటున్న అతడు త్వరలోనే జట్టులో చేరతాడని బీసీసీఐ పేర్కొంది.అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కరోనా కేసులు బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇలాంటి తరుణంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన క్రికెటర్లు నిబంధనలను పక్కన పెట్టేశారు.కనీసం మాస్కులు కూడా లేకుండా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.అక్కడి ప్రజలు వారిని గుర్తు పట్టి ఫొటోలు దిగుతున్నారు.
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగానే బీసీసీఐ స్పందించింది.రోహిత్ శర్మ, కోహ్లిలకు హెచ్చరిక జారీ చేసింది.
ఏ ఒక్క ఆటగాడు అజాగ్రత్తగా ఉన్నా మొత్తం జట్టు అంతటికీ కరోనా సోకే ప్రమాదం ఉంది.దీంతో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న ఆటగాళ్లను బీసీసీఐ వివరణ కోరనుంది.
ప్రస్తుతం యూకేలో కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది.ఆ దేశంలో ప్రతిరోజూ 10,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.