పుచ్చ గింజలు( watermelon seed seeds ) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.చాలామంది ఇష్టంగా తినే గింజల్లో ఇవి కూడా ఒకటి.
అలాగే పలు రకాల స్వీట్స్ తయారీలో పుచ్చ గింజలను ఉపయోగిస్తుంటారు.అనేక రకాల విటమిన్స్ మినరల్స్ కు పుచ్చ గింజలు పవర్ హౌస్ లాంటివి.
అందువల్ల రెగ్యులర్ డైట్ లో పచ్చ గింజలను చేర్చుకుంటే అనేక ఆరోగ్య లాభాలు పొందుతారు.అంతే కాదండోయ్ అందాన్ని పెంచే సామర్థ్యం కూడా ఈ గింజలకు ఉంది.
ముఖ్యంగా మొటిమలు మచ్చలు లేని మెరిసే చర్మాన్ని అందించడానికి పుచ్చ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి.అందుకోసం పుచ్చ గింజలను చర్మానికి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పుచ్చ గింజలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పుచ్చ గింజల పొడి ( Watermelon seed powder )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా లాభాలు పొందుతారు.
పుచ్చకాయ గింజల్లో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి, మొటిమలను తగ్గిస్తుంది.పుచ్చ గింజల మాస్క్ మొండి మచ్చలను అరికడతాయి.
అలాగే పుచ్చకాయ గింజల్లో ఒమేగా-6 మరియు ఒమేగా-9 వంటి కొవ్వు ఆమ్లాలు మీ చర్మాన్ని మెరిసేలా మరియు మృదువుగా చేస్తాయి.

పుచ్చ గింజల మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.ఫలితంగా చర్మం క్లియర్ అండ్ స్మూత్ గా మారుతుంది. పుచ్చ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.
పైన చెప్పిన విధంగా పుచ్చ గింజల ఫేస్ మాస్క్ వేసుకుంటే స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఇ ముడతలు, చారలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.
చర్నాన్ని కాంతివంతంగా మరియు అందంగా సైతం మెరిపిస్తుంది.