టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగా మారిన రెమ్యునరేషన్లు.. చిన్న హీరోకు అన్ని కోట్లా?

టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్, పుష్ప2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి.అయితే అటు స్టార్ హీరోలు ఇటు మిడిల్ రేంజ్ హీరోలు చిన్న హీరోలు భారీ స్థాయిలో పారితోషికాలను పెంచేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 Tollywood Small Hero Demands 4 Crore Remuneration Details Inside Goes Viral In S-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక చిన్న హీరో మొన్నటివరకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకోగా ఇప్పుడు 4 కోట్ల రూపాయల రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ హీరో గత సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.బ్యాకింగ్ లేకపోయినా ఈ చిన్న హీరో కొన్ని హిట్లు ఖాతాలో ఉండటంతో ఈ హీరో రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Telugu Crore, Tollywood Small, Tollywoodsmall-Movie

అయితే హీరోల సినిమాలకు అవుతున్న బడ్జెట్ కు జరుగుతున్న బిజినెస్ కు సంబంధం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగా రెమ్యునరేషన్లు మారుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు టెక్నీషియన్ల పారితోషికాలు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.ప్రస్తుతం సినిమాలకు థియేట్రికల్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

Telugu Crore, Tollywood Small, Tollywoodsmall-Movie

కరోనా తర్వాత పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులు సైతం భారీ రేటుకు అమ్ముడవని పరిస్థితి నెలకొంది.ఓటీటీలు హిట్టైన సినిమాల హక్కులను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి.ఇలాంటి సమయంలో హీరోల తీరు మారకపోతే భవిష్యత్తులో సినిమాలను నిర్మించే వాళ్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.పెద్ద హీరోలు సైతం తమ పారితోషికాలను 150 కోట్లు, 200కోట్ల రూపాయలకు పెంచేస్తున్నారు.

అయితే సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే పరిస్థితి ఏంటనే విషయాన్ని మాత్రం ఆలోచించడం లేదు.టాలీవుడ్ హీరోల తీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube