తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఇండియాలో నెంబర్ వన్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక దానికి బాలీవుడ్ హీరోలు సైతం వాళ్లు చేస్తున్న సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో అది మనవాళ్లకు చాలావరకు ప్లస్ అవుతుంది.

మరి ఇప్పటివరకైతే ప్రభాస్(Prabhas) నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు.ఇక షారుక్ ఖాన్ (Shahrukh Khan)లాంటి హీరో కూడా ‘జవాన్’ (Jawan)సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టినప్పటికి ‘డంకి’(Dunk’) సినిమాతో మాత్రం బొక్క బోర్లా పడ్డాడు.మరి ఈ సినిమాలన్నింటితో ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది పెద్దగా వర్కౌట్ అయితే కావడం లేదు.ఇక ప్రభాస్ షారుక్ ఖాన్ (Prabhas ,Shahrukh Khan)మధ్య కొంతవరకు పోటీ అయితే నడుస్తుంది.
మరి వీళ్ళిద్దరిలో ప్రభాస్ కింగ్ ఖాన్ (Prabhas King Khan)ను ఢీ కొట్టి నెంబర్ వన్ పొజిషన్ ని ఆక్రమిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి అయితే షారుక్ ఖాన్ బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.మరి వీళ్ళిద్దరి మధ్య జరిగే పోటీలో ఎవరు ఫైనల్ గా గెలుస్తారు ఎవరు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…ఒకవేళ రాబోయే సినిమాలతో ప్రభాస్ సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఆయనే నెంబర్ వన్ హీరోగా మారతాడు…ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది…
.