టాలీవుడ్ హీరో నాని( Tollywood hero Nani ) గురించి మనందరికీ తెలిసిందే.ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన నాచురల్ స్టార్ నాని అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు టాప్ హీరోగా దూసుకుపోతున్నారు.విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

కేవలం హీరోగా సినిమాలలో నటించడంతో పాటు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3.ఈ సినిమాలో అర్జు్న్ సర్కార్ ( Arjun Sarkar )అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో నాని కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇటు హీరోగానే కాకుండా అటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు.తన నిర్మాణంలో ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను నిర్మిస్తూ విజయం సాధిస్తున్నారు.

ఇటీవల నాని సొంత బ్యానర్ పై నిర్మించిన సినిమా కోర్టు.చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే రామ్ జగదీష్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాని.కోర్టు చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు ఓటీటీల్లోనూ సత్తా చాటుతోంది.
ఈ క్రమంలోనే కోర్టు సినిమా దర్శకుడికి ఖరీదైన కారును బహుమతిగా అందించారు నాని.అయితే దర్శకుడికి కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని నాని ఎక్కడ బయట పెట్టలేదు.
సోషల్ మీడియాలో ఫోటోస్ సైతం షేర్ చేయలేదు.కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోర్టు డైరెక్టర్ ఈ విషయాన్ని రివీల్ చేసాడు.
నాని చేతుల మీదుగా కారు బహుమతిగా తీసుకోవడం పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పుకొచ్చాడు.ఈ విషయం ఆనందంగా అందరికీ చెప్పుకోవాలని ఉందని కానీ గిఫ్ట్ ఇచ్చి ఇలా బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని అందుకే ఎవరికీ చెప్పలేదని అన్నారు.
దీంతో ఇప్పుడు నానిపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే నాని మంచి మంచి పొజిషన్లకు వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు.