పూర్వం రోజులలో చెప్పులు ఇంటి బయటే తీసి లోపలికి వచ్చేవారు.ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ చెప్పులు లేకుండానే ఇంట్లో తిరిగేవారు.
అయితే ప్రస్తుత రోజులలో చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.కొంతమంది బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్న బూట్లు లేదా చెప్పులతోనే ఇంట్లోకి వస్తున్నారు.
హిందూ సంస్కృతిలో( Hindu culture ) దీనిని అనేకమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కొందరు ఇంట్లో చెప్పులు లేదా బూట్లు ధరించడం చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి లోపల చెప్పులు ధరించడం మంచిదా, కాదా ఇప్పుడు తెలుసుకుందాం.

శని మన పాదాలకు సంబంధించినదని పండితులు చెబుతున్నారు.పాదాలకు ధరించే బూట్లు, చెప్పులు( Shoes , sandals ) రాహు కేతువులకు చిహ్నాలు.వీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు కూడా ఉంచకూడదు.ఇలా ఉంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.రాహువు, కేతువు వంటి దోష గ్రహాలు కూడా బూట్లు చెప్పులు ధరించిన వ్యక్తితో ఇంట్లోకి ప్రవేశిస్తాయి.అందుకే ఇంట్లో చెప్పులు ధరించకూడదు.
ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్, పూజగది( Kitchen, store room, worship room ) మొదలైన వాటి ముందు బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల డబ్బు, ధాన్యానికి కొరతా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.

అలాగే బూట్లు, చెప్పులను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచకూడదని గుర్తు పెట్టుకోవాలి.మట్టి కొట్టుకుపోయిన బూట్లతో ఇంటికి వచ్చి ఉత్తరం దిక్కున వాటిని తీసేస్తే మీ ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది.ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మి కూడా అలాంటి ఇంట్లోకి ప్రవేశించదు.
ఆ ఇంట్లో ప్రతికూల శక్తి బలపడే అవకాశం ఉంది.అందువల్ల మీరు మురికి బూట్లు, చెప్పులు ఉత్తర దిశలో ఎప్పుడు ఉంచకూడదు.
దీనికి బదులుగా బూట్లు, చెప్పులు దక్షిణాన లేదా పశ్చిమ దిశలో ఉంచాలి.చిరిగిన పాత బూట్లు ధరించడం వల్ల శని ఆశుభ నీడ మీపై పడి ఇంట్లోకి దరిద్రాన్ని తెస్తుంది.
అందువల్ల మీరు ఇంటి లోపల ఎప్పుడూ చెప్పులు లేదా బూట్లు ధరించకూడదు.