అపర ఏకాదశి పూజా నాడు ఈ ఒక్క పూజ చేస్తే చాలు.. అన్నీ లాభాలే!

అపర ఏకాదశి నాడు ఉపవాసం పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు.

 Apara Ekadshi Puja Benifits N Apara Ekadshi, Puja, Maha Vishnuvu, Devotional, V-TeluguStop.com

ఈరోజున అంటే అపర ఏకాదశి నాడు శ్రీ మహా విష్మువును అరాధించడం వల్ల ఆయన కృప మనపై ఉంటుందని భక్తుల నమ్మకం.అలాగే ఉపవాసం ఉండటం వల్ల పాపాలు, దుఃఖాలు, బాధలు పోయి మోక్షం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

అపర ఏకాదశి పూజా విధానం. 

అపర ఏకాదశికి ముందు రోజు నుంచి వెల్లల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యాన్ని మానేయాలి.అపర ఏకాదశి రోజు ఉదయమే లేచి తల స్నానం చేయాలి.ఆ తర్వాత ఈరోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పుజాస్తానని ప్రతిజ్ఞ చేయాలి.ఆ తర్వాత పూజా స్థలంలో ఒక పీఠంపై విష్ణువును ప్రతిష్టించండి.ఇప్పుడు శుభ ముహూర్తంలో విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయండి.

పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలు, పండ్లు, అక్షతలు, చందనం, పసుపు, కుంకుమ, పంచామృతం, తులసి ఆకు, బెల్లం, తమలపాకులు, అరటి పండు, ధూపం, దీపం, సువాసన మొదలైన వాటిని శ్రీవారికి సమర్పించండి.దీని తర్వాత విష్ణు చాలీసా, విష్ణు సహస్ర నానం అపర ఏకాదశి కథ పారాయణం చేయండి.

అప్పుడు విష్ణువు హారతితో పూజ ముగించండి.పూజానంతరం బ్రాహ్మణుడికి గోధుమలు, బెల్లం, పసుపు, పసుపు బట్టలు, పండ్లు మొదలైన వాటిని దానం చేయాలి.

రోజంతా పండ్లను మాత్రమే తినాలి.అలాగే భక్తి స్తోత్రాలు చదవండి.

రాత్రి సమయంలో భగవత్ జాగరణ చేయండి.భగవంతుని భక్తితో గడపండి.

మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ పూజ చేయాలి.పారాయణ సమయంలో ఆహారం తీసుకొని ఉపవాసాన్ని పూర్తి చేయండి.

మీ కోరికలు నెరవేరాలని విష్ణువును ప్రార్థించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube