మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి తెలుగు నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.ఈ క్రమంలోనే మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసంలో శుక్ల పక్షంలో దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి.
తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగడం వల్ల ఈ ఉత్సవాలను నవరాత్రులు అని పిలుస్తారు.
ఈ నవరాత్రుల సమయంలో సాక్షాత్తు అమ్మవారు భూలోకానికి వచ్చే భూలోకంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే నవరాత్రులు భాద్రపదమాసం మహాలయ పక్షం పూర్తయిన తర్వాత ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ప్రారంభమవుతాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? నవరాత్రులలో కలశ స్థాపనకు ఏ ముహూర్తం సరైనది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఏడాది దేవీ నవరాత్రులు 2021 అక్టోబర్ 7వ తేదీ అంటే గురువారం నుంచి ప్రారంభమవుతాయి.ఎంతో పవిత్రమైన ఈ రోజునే కలశస్థాపన జరుగుతుంది.దేవీ నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని శైల త్రిపుర సుందరిగా అలంకరించి పూజిస్తారు.
ఎంతో పవిత్రమైన ఈరోజు వివాహ శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు.ఈ శుభకరమైన రోజు కలశస్థాపన చేయటానికి ఉదయం 6: 17 నిమిషాల నుంచి 7:07 వరకు మంచి శుభ ముహూర్తం అని పండితులు చెబుతున్నారు.ఈ నవరాత్రులు ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు ఉపవాస దీక్షలతో పెద్దఎత్తున అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటారు.