గత సంవత్సరం ఎక్కువ మంది దర్శించుకున్న ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి.. తిరుమల స్థానం..

భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.మన దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మంది చెప్పే పేరు ఉత్తరప్రదేశ్లోని వారణాసి.2022 సంవత్సరంలో ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థయాత్ర గమ్య స్థానంగా వారణాసి ఉంది.ఓయో కల్చరల్ ట్రావెల్ 2022 రిపోర్ట్ ఈ విషయాన్ని తెలిపింది.

 The Most Visited Spiritual Place Last Year Is Varanasi. Tirumala Is The Location-TeluguStop.com

తెలుగు వారి కలియుగ దైవం వెంకటేశ్వర నిలయం తిరుమల తిరుపతి రెండో స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపించిన దర్శించిన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా వారణాసి నిలవడం విశేషం.

ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ లో తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది.తర్వాత ఒడిశాలోని పూరి, పంజాబ్లోని అమృత్సర్, ఉత్తర్ఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా మొదటి ఐదు స్థానాలలో నిలిచాయని నివేదికలో తెలిసింది.

Telugu Bhakti, Devotional, Kashi, Oyocultural, Spiritual Place, Tirumala, Varana

వారణాసి హిందువులు మరియు బౌద్ధులు ఇద్దరికీ ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.పూర్తి భారత దేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే దీన్ని ప్రజాధరణ ఎక్కువగా ఉన్నట్లు ఒక నివేదిక.ఒక ప్రదేశాన్ని మళ్లీ సందర్శించడానికి చాలామంది ఇష్టపడరు.అయితే తీర్థయాత్రల విషయానికి వస్తే ఇక్కడికి ఎన్నిసార్లు అయినా రావడానికి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

తీర్థ యాత్రకు వచ్చే జనంలో వృద్ధులే కాకుండా యువత కూడా ఎక్కువగా పాల్గొంటున్నారు.చాలామంది ప్రయాణికులు ఇప్పుడు గొప్ప సాంస్కృతిక ప్రదేశాలు, తెలియని ప్రదేశాలు, రాజభవనాలు మరియు మతపరమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే 2022 సంవత్సరంలో భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.గతంతో పోల్చితే షిరిడి 483% మొదటి స్థానంలో ఉండగా, తిరుపతి 233%, పూరి 117%తో వారణాసి తర్వాత డిమాండ్ బుకింగ్స్ జరిగిన పుణ్యక్షేత్రాలు.

అదేవిధంగా అమృత్సర్, హరిద్వారాలలో కూడా గదుల బుకింగ్స్ లో భారీ పెరుగుదల కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube