ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత శ్రీరామనవమి( Sri Rama Navami ) పండుగను జరుపుకుంటారు.ప్రజలు రాములవారిని ఎంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అయితే ఈ శ్రీరామనవమి ఉత్సవాలనేవి ఉగాది తర్వాత నుంచి నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరు కన్నుల పండుగలా జరుపుకుంటారు.ముఖ్యంగా ఈ రామ నవమి ఉత్సవాలు అనేవి ఎక్కువగా గ్రామాలలో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీరామ నవమికి పది రోజుల ముందు నుంచి ఈ వేడుకలను ఆలయాలలో మొదట పెడతారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క దేవాలయాన్ని( Temple ) తాటాకు పందిళ్లు వేసి ఎంతో అందంగా అలంకరిస్తారు.
గ్రామాలలో రామ నవమి ఉత్సవాలకు చిన్న పిల్లలు, మహిళలు అనే తేడ లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని సేవలు కూడా చేస్తూ ఉంటారు.

శ్రీరామనవమి ఉత్సవానికి ఒక రోజు ముందు ఇలా చేస్తే మీ జన్మ ధన్యం అయిపోతుంది.అలాగే ఆ రాముల వారి అనుగ్రహం అందరికీ కలిగి సకల పాపాన్ని తొలగిపోతాయి.ఇంతకీ శ్రీరామనవమి ముందు రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన ధర్మ ప్రకారం చైత్ర మాసం తొమ్మిదవ రోజున ఆ శ్రీరామచంద్రుడు( Sri Rama Chandra ) జన్మించినట్లు చెబుతున్నారు.అయితే ఈ సంవత్సరం శ్రీరామనవమిని ఏప్రిల్ 17వ తేదీన జరుపుకోనున్నారు.
గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.అలాగే ఈ వేడుకల్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు అనే బేధం లేకుండా అందరూ పాల్గొని దేవాలయాలలో సేవలు చేస్తూ ఉంటారు.
అయితే ఇలా కోదండ రాముడి సేవలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలని తాపత్రయ పడుతూ ఉంటారు.మరి అలాంటివారు శ్రీరామనవమికి ఒక రోజు ముందు ఇలా చేస్తే మీ జన్మ ధన్యం అవుతుంది.

రామ నవమి ఉత్సవాలు ప్రారంభం కాకముందు ఆలయాలలో అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది.దేవాలయాలను శుభ్రంగా కడగడం, ముగ్గులు పెట్టడం, ఆలయాలకు తోరణాలు కట్టడం, అందంగా పుష్పాలతో అలంకరించడం వంటివి చేస్తే శ్రీరాముడి అనుగ్రహన్ని పొందవచ్చు.కాబట్టి నవమి ముందు రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న దేవాలయాలలో ఇలాంటి సేవలు చేయాలి.ఇదే కాకుండా నవమి ఉత్సవాలకు ఈ సేవ ఎవరు చేసిన వారి జన్మ ధన్యమైపోతుంది.
అలాగే కచ్చితంగా మీరు అనుకున్న కార్యాలు అన్ని నెరవేరుతాయి.