శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదర్శనల మహోత్సవం ఆదివారం ఎలా జరిగిందంటే..

ద్వారక తిరుమల శేషాచలం పై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణాల మహోత్సవం ఆదివారం రోజు నేత్రపర్వంగా ఎంతో ఘనంగా, వైభవంగా జరిగింది.

కొండ దిగువన శ్రీవారి పాదుకా మండలం నుండి మొదలై చుట్టూ దాదాపు 6 కిలోమీటర్ల మేర ఈ మహోత్సవం ఎంతో వైభవంగా సాగింది.

ఈ వైభవాన్ని కనులారా చూడడానికి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు.ఈ మహోత్సవాన్ని గోవింద స్వాములు శ్రీవారిని స్మరిస్తూ ముందుకు సాగారు.

మొదటిగా శ్రీవారి పాదుకా మండపం వద్ద శ్రీవారి ప్రచార రథాన్ని రంగురంగుల పుష్ప మూలికలతో సుందరంగా అలంకరించారు.ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడిని విశేషంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి హారతులు కూడా ఇచ్చారు.

దేవస్థానం అనువంశిక ధర్మకర్త రావు, ఈవో వెంట త్రినాధరావుతో కలిసి గిరి ప్రదక్షిణను మొదలుపెట్టారు.వేదమంత్రాలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య దొరసానిపాడు రాళ్ల కుంట, లింగయ్య చెరువు, ఉగాది మండపం మీదుగా తిరిగి పాదుకా మండపం వద్దకు ఈ మహోత్సవం కొనసాగింది.

Advertisement

ప్రచార రథంలో కొలువుదిరిన స్వామివారి దివ్య మంగళ రూపాన్ని అక్కడికి వచ్చిన భక్తులందరూ దర్శించుకున్నారు.

గిరి ప్రదక్షణ పూర్తయిన తర్వాత భక్తులకు, గోవింద స్వాములకు శ్రీవారి నిజరూప దర్శన భాగ్యం కల్పించారు.ఆలయ ఈఈ లు భాస్కర రావు, ఎన్ వి ఎస్ రాజు, ఏఈఓ లు దుర్గారావు, కేఎల్ఎం రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈవో వెల్లడించారు.ఉదయం ఐదు గంటల నుంచి వెండి గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని వెల్లడించారు.

పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు