Vasantha Panchami : వసంత పంచమి నాడు అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదాలు ఇవే..!

వసంత పంచమి( Vasantha Panchami ) సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి అనుగ్రహం కోసం ఈ నైవేద్యాలు సమర్పించాలి.వృత్తిలో, చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, అదృష్టం వర్తించాలంటే ఈ విధంగా చేయాలని పండితులు చెబుతున్నారు.

 These Are The Prasads To Offer To Goddess On Vasantha Panchami-TeluguStop.com

వసంత పంచమి రోజున సరస్వతీ దేవితో పాటు శివుడు, విష్ణువుని ( Shiva , Vishnu )పూజించడం ప్రత్యేక ఆచారం.అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాలి.

ఈ నైవేద్యాలు సమర్పించడం వలన సరస్వతి దేవి ఆశీస్సులు లభించి జీవితంలోని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి.

Telugu Boondi Laddu, Butter, Dry Fruits, Ghee, Knowledge, Milk, Saffron-Latest N

అలాగే సరస్వతి దేవి అనుగ్రహంతో జ్ఞానం, విద్యకు( knowledge , education ) సంబంధించిన లోపాలు కూడా తొలగిపోతాయి.ఇక పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వలన సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.అయితే వసంత పంచమి నాడు సరస్వతి దేవికి ఏ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వసంత పంచమి రోజు సరస్వతి దేవికి ఇష్టమైన స్వీట్ బూంది పూజ సమయంలో సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి.అలాగే జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి.బూందీ లడ్డు( Boondi Laddu ) సమర్పించి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.ఇలా చేయడం వలన సరస్వతి దేవి దయ మీ పై ఉంటుంది.

అమ్మవారికి పాలు, వెన్న, నెయ్యి అంటే ఎంతో ప్రీతి.

Telugu Boondi Laddu, Butter, Dry Fruits, Ghee, Knowledge, Milk, Saffron-Latest N

కాబట్టి వసంత పంచమి రోజు బెల్లం వేసి పరమాన్నం చేసి సమర్పించాలి.దేశీ నెయ్యి, చక్కెర లేదా బెల్లం, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ ( Saffron, dry fruits )వేసి పరమాన్నం తయారు చేయాలి.సరస్వతి దేవికి మరొక ఇష్టమైన పదార్థం మాల్పువా.

పిల్లలకు చదువులో, పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురైతే వాటిని అధికమించేందుకు సరస్వతీ దేవికి మాల్పువా సమర్పించాలి.దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన మానసిక వికాసాన్ని పొందుతారు.

అలాగే తెలివితేటలు మెరుగవుతాయి.అదేవిధంగా శనగపిండి లడ్డు, రాజ భోగ్ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube