ఇంగ్లాండ్‌లో( England ) తన వద్ద చికిత్స తీసుకుంటున్న మహిళా రోగులపై( Female Patients ) లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతికి చెందిన వైద్యుడు తన నేరాన్ని అంగీకరించాడు.ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌లోని హవంత్‌లోని స్టాంటన్ సర్జరీలో( Staunton Surgery ) మాజీ జనరల్ ప్రాక్టీషనర్ మోహన్ బాబు( Dr Mohan Babu ) ఇటీవల పోర్ట్స్‌మౌత్ క్రౌన్ కోర్టులో( Portsmouth Crown Court ) మూడు వారాల పాటు జరిగిన విచారణకు హాజరయ్యాడు.
ఏప్రిల్ 12న అదే కోర్టు మోహన్ బాబుకు శిక్ష ఖరారు చేయనుంది.దీంతో అతనిని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేసినట్లు పోర్ట్స్‌మౌత్ కేంద్రంగా పనిచేస్తున్న దినపత్రిక ది న్యూస్ నివేదించింది.
లైంగిక వేధింపులు సెప్టెంబర్ 2019 నుంచి జూలై 2021 మధ్య జరిగాయని.బాధితులలో 19 ఏళ్ల యువతి కూడా వున్నట్లు కోర్టు పేర్కొంది.అదే క్లినిక్‌లో జనరల్ ప్రాక్టీషనర్ అయిన తన భార్యతో పాటు మోహన్ బాబు పనిచేసిన స్టాంటన్ సర్జరీ ప్రాంగణంలో ముగ్గురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు.మోహన్ బాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.
బాధితులను అనుచితంగా తాకడం,( Inappropriately Touching ) గగుర్పాటు కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటి వాటిపై ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
![Telugu Mohan Babu, England, Hampshire, Havant, Indian Origin, Sexual Assaults, U Telugu Mohan Babu, England, Hampshire, Havant, Indian Origin, Sexual Assaults, U](https://telugustop.com/wp-content/uploads/2024/02/Indian-origin-doctor-found-guilty-of-sexual-assaults-on-3-patients-in-England-detailss.jpg)
నిందితుడి మాజీ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌తో సహా మరో ఐదుగురు మహిళలు అతని అనుచిత ప్రవర్తన గురించి ఫిర్యాదు చేశారు.అయినప్పటికీ వారి ఫిర్యాదులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు.2018 ఏప్రిల్‌లో శస్త్రచికిత్స విభాగంలో డాక్టర్‌గా చేరిన అనంతరం.మరో వైద్యుడికి బదులుగా సేవలందించాడు.ఈ క్రమంలో బలహీనమైన మహిళలను మోహన్ బాబు లక్ష్యంగా చేసుకున్నారని ప్రాసిక్యూటర్ మిరాండా మూర్ కేసీ( Prosecutor Miranda Moore KC ) కోర్టుకు తెలిపారు.మోహన్ బాబు ప్రవర్తనపై తొలి ఫిర్యాదు ఆగస్ట్ 2019లో వచ్చింది.2019 మే , ఆగస్ట్ మధ్య మోహన్ బాబు 57 ఏళ్ల మహిళతో ముఖాముఖి సంప్రదింపులు జరిపాడని.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాధితురాలు తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు మూర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
![Telugu Mohan Babu, England, Hampshire, Havant, Indian Origin, Sexual Assaults, U Telugu Mohan Babu, England, Hampshire, Havant, Indian Origin, Sexual Assaults, U](https://telugustop.com/wp-content/uploads/2024/02/Indian-origin-doctor-found-guilty-of-sexual-assaults-on-3-patients-in-England-detailsa.jpg)
అనవసరమైన, హానికరమైన పరీక్షలు నిర్వహించడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం , రోగులపై శారీరకంగా దాడి చేయడం వంటి చర్యలకు మోహన్ బాబు తన వృత్తిని ఎలా ఉపయోగించుకున్నాడో మూర్ కోర్టుకు వివరించారు.మోకాలి, తుంటి సమస్యలతో చికిత్స పొందుతున్న ఓ రోగి మాట్లాడుతూ.నిందితుడు తనను కౌగిలించుకుని ఫోన్ నెంబర్ అడిగాడని చెప్పింది.విచారణ కొనసాగుతున్న దశలో అనేకమంది మహిళలు మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.2021 జూలైలో మోహన్ బాబు స్టాంటన్ సర్జరీలో( Staunton Surgery ) పనిచేయడం మానేయడంతో పాటు తనపై వచ్చిన అభియోగాలను ఖండించాడు.