ప్రస్తుత రోజుల్లో స్పెర్మ్ కౌంట్( Sperm count ) తగ్గిపోవడం అనేది పురుషుల్లో ఒక సామాన్య సమస్యగా మారింది.ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి, కండా నిద్ర లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్, అధిక కొవ్వు, చక్కెర ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, పోషకాల కొరత, హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్, హైబీపీ, ఓవర్ వెయిట్, పొల్యూషన్, మొబైల్ రేడియేషన్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను మోకాలిపై ఉంచుకుని పని చేయడం, బిగుదైన లోదుస్తులు ధరించడం, అధిక ఉష్ణోగ్రతల వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం తదితర కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం లేదా వాటి నాణ్యత దెబ్బతినడం జరుగుతుంటుంది.
ఫలితంగా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం, సంతాన సమస్యలు తలెత్తుయి.ఈ నేపథ్యంలోనే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ను పెంచే కొన్ని సూపర్ ఫుడ్స్ ను నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాబితాలో నట్స్ అండ్ సీడ్స్( Nuts and Seeds ) గురించి మొదటిగా చెప్పుకోవాలి.బాదం, వాల్‌నట్, పిస్తా వంటి నట్స్( Nuts , almonds, walnuts, pistachios ) లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి.
చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు), పంప్కిన్ సీడ్స్(గుమ్మడి గింజలు), సన్‌ఫ్లవర్ సీడ్స్ లో జింక్, సెలీనియం, విటమిన్ ఇ మెండుగా నిండి ఉంటాయి.ఇవి వీర్యకణాల సంఖ్యతో పాటు వాటి నాణ్యతను పెంచుడంలో తోడ్పడతాయి.

స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే పురుషులు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. గుడ్లు, సాల్మన్, ట్యూనా ( Eggs, salmon, tuna )వంటి చేపలు, పన్నీర్, శనగలు, బీన్స్, కందిపప్పు( Fish, Paneer, Lentils, Beans ), మొలకెత్తిన విత్తనాలు, ఓట్స్ వంటి ఫుడ్స్ ప్రోటీన్ ను గొప్ప మూలం.అలాగే పెరుగు, పాల పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి.వీటిలో ప్రొబయోటిక్స్ మరియు కాల్షియం అధికంగా ఉండటంతో హార్మోన్ల సమతుల్యత కాపాడతాయి.

టమాటో స్పెర్మ్ కౌంట్‌ను పెంచే సూపర్ ఫుడ్‌గా చెప్పబడింది.తగిన మోతాదులో టమాటోను తీసుకుంటే అందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, ద్రాక్ష, బొప్పాయి వంటి పండ్లను తినడం వల్ల కూడా వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది.పాలకూర, బీట్‌రూట్ వంటి ఫుడ్స్ లో ఫోలేట్ మెండుగా ఉంది.
ఇది స్పెర్మ్ నాణ్యతను మరియు కౌంట్ ను మెరుగుపరుస్తుంది.ఇక ఈ ఫుడ్స్ ను తీసుకోవడంతో పాటు స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకునేందుకు ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్, అధిక కాఫీ తీసుకోవడం తగ్గించాలి.
రోజూ వ్యాయామం, ధ్యానం చేయాలి.ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండాలి.
కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.రేడియేషన్, కెమికల్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవాలి.
మరియు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.