చక్కెర లేదా పంచదార( sugar ).తినడానికి మధురంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం చాలా హానీ చేస్తుంది.
చక్కెర వినియోగంతో చాలా మంది చేతులారా అనేక జబ్బులను ఆహ్వానిస్తున్నారు.చక్కెరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఏమీ ఉండవు.
కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు( Carbohydrates and calories ) మాత్రమే ఉంటాయి.అటువంటి చక్కెరను ఒక్కసారిగా తీసుకోవడం మానేస్తే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.
ఆ మార్పులన్ని మీకు మేలు చేసేవే కావడం విశేషం.
చక్కెర వినియోగం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు( Glucose levels ) ఆమాంతం పెరిగి, తిరిగి త్వరగా పడిపోతాయి.
ఫలితంగా అలసట, అతి ఆకలి వంటి సమస్యలు వస్తాయి.అదే చక్కెర తీసుకోవడం మానేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు స్థిరంగా ఉంటాయి.చక్కెరను దూరం పెట్టడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగవుతుంది.టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.

చక్కెర మరియు చక్కెర పదార్థాలు తినడం మానేస్తే, శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.షుగర్ ఎక్కువగా తినడం వలన చర్మం త్వరగా ముడతలు పడుతుంది.అదే షుగర్ మానేస్తే స్కిన్ ఏజింగ్ ( Skin Aging )ఆలస్యమవుతుంది.చర్మం కాంతివంతంగా మారుతుంది, మొటిమలు తగ్గుతాయి.ఒక్కసారిగా చక్కెర మానేయడం వల్ల శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు.కానీ, కొద్దిరోజులకు శరీర శక్తి స్థాయిలు స్థిరంగా మారతాయి, అలసట దూరం అవుతుంది.

చక్కెర అధికంగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ( heart health )హానికరం.చక్కెర మానితే కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.మీ గుండె పదిలంగా ఉంటుంది.అంతేకాదండోయ్.చక్కెర తీసుకోవడం మానేయడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది.
చక్కెరను కంప్లీట్ గా ఎవైడ్ చేస్తే మెదడు స్పష్టంగా ఆలోచించగలుగుతుంది.మూడ్ స్వింగ్‌లు తగ్గుతాయి, తరచూ ఒత్తిడి బారిన పడకుండా ఉంటాయి.
చక్కెర వాడటం ఆపేయడం వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.