మ‌ద్యం తాగేట‌ప్పుడు మిర‌ప‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది మ‌ద్యానికి అల‌వాటు ప‌డుతున్నారు.ముఖ్యంగా యూత్ ఫ్యాష‌న్ పేరుతో విచ్చ‌ల విడిగా ఆల్క‌హాల్‌ను తీసుకుంటూ మ‌త్తులో ఊగుతున్నారు.

 Do You Know What Happens When You Eat Green Chili While Drinking Alcohol? Green-TeluguStop.com

ఆరోగ్యం దెబ్బ తింటుంద‌ని తెలిసినా ఈ చెడు అల‌వాటును మాత్రం మానుకోవ‌డం లేదు.అయితే కొన్ని కొన్ని చిట్కాల‌ను పాటిస్తే మ‌ద్యం తీసుకున్నా ఆరోగ్యాన్ని కాపాడు కోవ‌చ్చు.

ముఖ్యంగా ఆల్క‌హాల్ తీసుకునే స‌మ‌యంలో ప‌చ్చి మిర‌ప‌కాయ తింటే లివ‌ర్ ఆరోగ్యం పాడ‌వ‌కుండా ఉంటుంద‌ట‌.

సాధారణంగా చాలా మంది మ‌ద్యం తాగేట‌ప్పుడు స్ట‌ఫ్ కింద ప‌కోడీ, ఆమ్లెట్‌, చిప్స్‌, పికిల్స్, జీడిపప్పు, వేరుశనగ పప్పు, నూనెలో వేయించిన చికెన్, ఫిష్‌ వంటి వాటిని తీసుకుంటారు.

కానీ, వీటి బ‌దులు ప‌చ్చి మిర‌ప‌కాయ తింటే లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ఆఫ్రికాలోని ప్రజలు మందు తాగే టైమ్‌లో స్ట‌ఫ్‌గా ప‌చ్చి మిర్చినే తీసుకుంటార‌ట‌.

అందుకే వారిలో లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌క్కువ‌గా ఉంటాయ‌ని ఓ ఆధ్య‌య‌నంలో తెలిసింది.ప‌చ్చి మిర‌పకాయ‌ల్లో శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.

అందు వ‌ల్లే, మ‌ద్యం తాగేట‌ప్పుడు సైడ్ డిష్‌గా వీటిని తింటే.ఆ యాంటీ ఆక్సిడెంట్స్ లివ‌ర్ ఆరోగ్యం పాడ‌వ‌కుండా ర‌క్షిస్తుంది.

మ‌రియు పచ్చి మిర్చి తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ సైతం పేరుకు పోకుండా ఉంటుంది.

అలా అని చెప్పి బాటిళ్ల మీద బాటిళ్లు మ‌ద్యాన్ని తాగేసి.కేజీల‌కు కేజీలు ప‌చ్చి మిర్చి తీసుకుంటే లేని పోని స‌మ‌స్య‌లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తాగే వారికి మాత్ర‌మే ప‌చ్చి మిర్చి టెక్నింగ్ యూజ్ అవుతుంది.

అంతేగాని ప్ర‌తి రోజు మ‌ద్యాన్ని తీసుకుని.ఆపై లివ‌ర్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప‌చ్చి మిర్చి తింటే ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు జాగ్ర‌త్త‌!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube