పులితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన కాలిఫోర్నియా మహిళ.. వీడియో వైరల్..

ఇటీవల సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక మహిళ పులితో కలిసి ఈత కొడుతున్నట్లు కనిపించింది.

 A Video Of A Californian Woman Swimming In A Swimming Pool With A Tiger Has Gone-TeluguStop.com

ఈ మహిళ పేరు రియో లిల్లీ( Rio Lily ).ఆమె అమెరికాలోని కాలిఫోర్నియా ( California )రాష్ట్రానికి చెందినవారు.ఆమె అక్కడ మిర్టిల్ బీచ్ సఫారీ అనే జంతు ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు.ఆ జంతు ప్రదర్శనశాలలో ఏనుగులు, సింహాలు, పులులు, గొరిల్లాలు లాంటి అనేక జంతువులు ఉన్నాయి.

ఆ జంతువులు మనుషులపై ఎలాంటి ఎటాక్స్‌ చేయకపోవడం విశేషం.అందుకే చాలా మంది ఆ జంతువులతో కలిసి ఫోటోలు దిగడానికి అక్కడికి వెళుతుంటారు.

వైరల్ అవుతున్న వీడియోలో స్విమ్మింగ్ పూల్( Swimming pool ) చూడవచ్చు.అందులో రియోను వెనుక నుంచి పులి కౌగిలించుకోవడం గమనించవచ్చు.ఆ పులి రియా భుజాలపై తన ముందర కాళ్లను వేసి ఉంచింది.రియో కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది.

ఆమె ఈ వీడియోకి “నా పులి స్నేహితుడు లక్ష్మణ్” అని క్యాప్షన్ ఇచ్చింది.పులిని ఆమె బుగ్గలపై ముద్దు కూడా పెడుతుంది.

పులి ఒకసారి ఆమె వైపు చూసి, ఆ తర్వాత సౌకర్యంగా ఆమె వీపు మీద వాలిపోతుంది.కెమెరా వైపు కూడా చాలా దయగా చూస్తుంది.

ఈ వీడియోను రియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇప్పటివరకు ఈ వీడియోను 23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.అదే సమయంలో, 1 లక్షకు పైగా మంది ఈ వీడియోను లైక్ చేశారు.వేలాది మంది దీన్ని షేర్ కూడా చేశారు.ఈ వీడియోపై వందల్లో కామెంట్లు వచ్చాయి.వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ యూజర్ కామెంట్ చేస్తూ, “నా జీవితంలో నేను కోరుకునే పులి ఇదే” అని రాశారు.సురేష్ అనే యూజర్ “లక్ష్మణ్‌ని చూడండి బాబాయ్, ఈత కొలనులో ఎంతో సంతోషంగా స్నానం చేస్తున్నాడో.” అని కామెంట్ చేశారు.అయితే కొందరు ఈ పులిని చూసి వామ్మో పులితో ఆటలు ఆడటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని కామెంట్లు చేస్తున్నారు.

రియో ఇన్‌స్టాగ్రామ్‌లో జంతువులతో కలిసి ఉన్న అనేక ఫోటోలు, వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటుంది.కొద్ది రోజుల క్రితం, ఆమె గొరిల్లాలతో ఓ వీడియోను పంచుకోగా అది కూడా చాలామందిని ఆకట్టుకుంది.ఇందులో రియో గ్రీన్ స్లీవ్‌లెస్ టాప్ ధరించి అందంగా ఉంది.

రెండు గొరిల్లాలు ఆమెను రెండు వైపుల నుంచి కౌగిలించుకుని ముద్దు పెడుతుండగా, రియో కూడా వాటికి ముద్దు పెడుతుంది.ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఈ బేబీస్ ని నేను చాలా ప్రేమిస్తున్నా.” అని క్యాప్షన్ జోడించారు.అంతకుముందు ఒక వీడియోలో ఆమె తన ఒడిలో ఒక హైనాను పడుకోబెట్టుకొని కనిపించింది.

మరొక క్లిప్‌లో ఒక ఏనుగుకు స్నానం చేయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube