సన్ ఫ్లవర్ సీడ్స్ తో ఇలా చేశారంటే ఏజ్ పెరిగిన యవ్వనంగా మెరిసిపోతారు!

సన్ ఫ్లవర్ సీడ్స్.‌.

 Try This Sunflower Seeds Mask For Youthful Skin Details, Youthful Skin, Sunflow-TeluguStop.com

( Sun Flower Seeds ) తెలుగులో పొద్దుతిరుగుడు గింజలు.మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో ఇవి కూడా ఒకటి.

ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఫైబర్ తో సహా వివిధ పోషకాలను మనం సన్ ఫ్లవర్ సీడ్స్ ద్వారా పొందవచ్చు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు యవ్వనమైన మెరిసే చర్మాన్ని( Youthful Skin ) పొందడానికి కూడా ఈ గింజలు మనకు ఉపయోగపడతాయి.

అందుకోసం సన్ ఫ్లవర్ సీడ్స్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Face, Honey, Latest, Milk, Saffron, Skin, Skin Care, Skin Care Tips

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) వేసుకోవాలి.అలాగే అర కప్పు పచ్చి పాలు ( Milk ) పోసుకుని బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రుటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు కుంకుమ పువ్వును పాలతో సహా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Face, Honey, Latest, Milk, Saffron, Skin, Skin Care, Skin Care Tips

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ ఫేస్ మాస్క్ ను వేసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.

ముఖ్యంగా సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి స్కిన్ ఏజింగ్ ను( Skin Ageing ) ఆలస్యం చేస్తాయి.

ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.ఏజ్ పెరిగిన కూడా మీ చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తాయి.

అలాగే ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల స్కిన్ చాలా మృదువుగా మారుతుంది.చందనం పొడి కుంకుమపువ్వు చర్మానికి సహజమైన మెరుపును జోడిస్తాయి.అంతేకాదు ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది.

చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.మరియు పొడిగా ఉన్న చర్మాన్ని తేమగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube