ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లు నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అలంకరించే వస్తువుల వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం( Vastu Shastra ) ఉండాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.ఇలా ఉంటేనే ఇంట్లో సంతోషం వస్తుందని పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు.
ఇలా ఉండడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని కూడా చెబుతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఏ దిశలో ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఉత్తర దిక్కున కుబేరున్ని ఎక్కువగా భావిస్తారు.ఈ దిశలో ఖజానా ఉంచడం సరైనది కాదు.
కానీ మీరు మీ దుకాణంలో లేదా ఏదైనా వ్యాపార స్థలంలో ఈ దిశలో డబ్బులను పెట్టవచ్చు.

ఉత్తర దిశను ( North direction )ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.కాబట్టి మీరు ఈ దిశలో చిన్న షవర్ ఏర్పాటు చేసుకోవాలి.ఇక తూర్పు దిశ విషయంలో పలు వాస్తు నియమాలను పాటించాలి.
ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు దిశలో వస్తువులు లేకుండా చూసుకోవాలి.ఈ దిశకు అధిపతులు సూర్యదేవుడు, ఇంద్రదేవుడు ( Suryadev , Indradev ) రోజుకి ఒకసారి ఈ దిశలో దీపం వెలిగించాలి.
ఈ స్థలాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.అలాగే గణేశుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని( Goddess Lakshmi idol ) ఈ దిశలో ఉంచితే మంచిది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో బరువైన వస్తువులు ఉండేలా చూసుకోవాలి.అలాగే ఈ దిశలో డబ్బులు నిల్వ చేయాలి.

ఎందుకంటే ఇది డబ్బును డిపాజిట్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశం.ఈ దిశలో మరుగుదొడ్లు అస్సలు నిర్మించకూడదు.ఇది యమాధిపతి దిశ.అలాగే పశ్చిమ దిశకు ఆది దేవత వరుణుడు.దీని పాలక గ్రహం శని.ఈ దిశలో ఇంటి వంటగదిని ( kitchen )నిర్మించుకుంటే మేలు జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.అలాగే ఈశాన్య దిశ శివుని స్థానంగా చెబుతూ ఉంటారు.ఈ దిశకు గృహస్పతి అధిపతి.పూజ గృహం, బోరింగ్, వాటర్ ట్యాంక్ కూడా ఈ దిశలో నిర్మించుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే నైరుతి దిశలో కూడా సామాగ్రి వంటి వస్తువులను పెట్టాలి.
అలాగే వాయువ్యం దిశలో విసిటింగ్ హాల్ వంటి నిర్మాణాలను చేపట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.