ఆంధ్రప్రదశ్ అసెంబ్లీ సభా హక్కుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను వ్యక్తిగతంగా దూషించారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు అసెంబ్లీలో సమావేశాలు జరిగినన్ని రోజులు మైక్ లు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడాన్ని క్షమించరాదని నిర్ణయించింది.ఈ తీర్మానాన్ని సభ హక్కుల కమిటీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు పంపనుంది.
వాస్తవానికి గత సమావేశంలో అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ సమావేశాలకు హాజరై ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.దీంతో ఆయనపై ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చునని అంతా భావించారు.
కానీ సభా హక్కుల కమిటీ లో ఉన్న వైసీపీ సభ్యులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.ఈ ప్రతిపాదనను టీడీపీకి చెందిన ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు.
రామానాయుడుని సీఎం జగన్ డ్రామా నాయుడు అంటేనే.తిరిగి రామానాయుడు మాట్లాడారని గుర్తు చేశారు.
కావాలంటే రికార్డులు పరిశీలించి కోవాలని సూచించారు ఆయన వాదనను అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.అచ్చం నాయుడుపై తనపై చర్య కోసం శాసనసభకు సిఫార్సు చేస్తున్నామని ప్రివిలేజ్ కమిటీ పేర్కొనడం అన్యాయం, దుర్మార్గమని రామానాయుడు పేర్కొన్నారు.
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ల శాసనసభలో మైక్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.మేమ్ అసెంబ్లీలో ఎప్పుడు తప్పు అబద్ధాలు మాట్లాడ లేదు అందువల్ల స్పీకర్ మాకు మైక్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోరని భావిస్తున్నామన్నారు.

ఆనాడు అసెంబ్లీలో గంటన్నర సేపు అధికారపక్షం మాట్లాడిన తర్వాతే తో మాట్లాడాను.నగదు బదిలీపై స్వల్పకాలిక చర్చలో ఐదారు నిమిషాలు మాత్రమే మాట్లాడాను.స్పీకర్ ఇచ్చిన సమయాన్ని మాత్రమే వాడాను.ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారం అప్పుడు వృద్ధులు వితంతువులు, దివ్యాంగులకు రూ.3000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇది మోసం చేయడమేనని మాట్లాడని తప్ప ఏమీ అనలేదు.ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఆ విషయాన్ని శాసనసభలో ప్రస్తావించాను మా తప్పేంటో చెప్పాలి.
ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారు.ప్రతిపక్షం గొంతు నొక్కకుండా స్పీకర్ వ్యవహరించాలని హితవు పలికారు.