తల స్నానం సమయంలో జుట్టు అధికంగా ఊడిపోతుందా.. అయితే ఈ ఆయిల్ ను మీరు వాడాల్సిందే!

సాధారణంగా కొందరికి తల స్నానం చేసే సమయంలో జుట్టు చాలా అంటే చాలా అధికంగా ఊడిపోతుంటుంది.ఎంత ఖరీదైన షాంపూను వాడినప్పటికీ ఈ సమస్య మాత్రం అస్సలు పరిష్కారం కాదు.

 Try This Powerful Oil To Stop Hair Fall , Hair Oil, Latest News, Stop Hair-TeluguStop.com

దీంతో ఏం చేయాలో తెలియక ఎంతగానో దిగులు చెందుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను మీరు వాడాల్సిందే.ఈ ఆయిల్ ను వాడితే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Latest, Long, Roots, Thick-Telugu He

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు మెంతులు, ( Fenugreek Seeds )ఒక కప్పు ఎండిన కరివేపాకు,( Curry Leaves ) వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిని( Green tea powder ) కూడా వేసుకోవాలి.అలాగే అర కప్పు ఆలివ్ ఆయిల్, అరకప్పు కోకోనట్ ఆయిల్( Coconut oil ) అరకప్పు ఆముదం వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో ఉంచి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి. ఆపై ఆ గ్లాస్ జార్ తీసుకుని రెండు రోజుల పాటు కదపకుండా ఒకచోట పెట్టేయాలి.

రెండు రోజుల అనంతరం ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Latest, Long, Roots, Thick-Telugu He

ఆపై మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను తలకు రాస్తే హెయిర్ రూట్స్ ( Hair Roots )స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్( Hair fall ) తో సతమతం అవుతున్న వారికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube