తల స్నానం సమయంలో జుట్టు అధికంగా ఊడిపోతుందా.. అయితే ఈ ఆయిల్ ను మీరు వాడాల్సిందే!

సాధారణంగా కొందరికి తల స్నానం చేసే సమయంలో జుట్టు చాలా అంటే చాలా అధికంగా ఊడిపోతుంటుంది.

ఎంత ఖరీదైన షాంపూను వాడినప్పటికీ ఈ సమస్య మాత్రం అస్సలు పరిష్కారం కాదు.

దీంతో ఏం చేయాలో తెలియక ఎంతగానో దిగులు చెందుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను మీరు వాడాల్సిందే.ఈ ఆయిల్ ను వాడితే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

"""/" / ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు మెంతులు, ( Fenugreek Seeds )ఒక కప్పు ఎండిన కరివేపాకు,( Curry Leaves ) వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిని( Green Tea Powder ) కూడా వేసుకోవాలి.

అలాగే అర కప్పు ఆలివ్ ఆయిల్, అరకప్పు కోకోనట్ ఆయిల్( Coconut Oil ) అరకప్పు ఆముదం వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో ఉంచి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.

ఆపై ఆ గ్లాస్ జార్ తీసుకుని రెండు రోజుల పాటు కదపకుండా ఒకచోట పెట్టేయాలి.

రెండు రోజుల అనంతరం ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

"""/" / ఆపై మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను తలకు రాస్తే హెయిర్ రూట్స్ ( Hair Roots )స్ట్రాంగ్ గా మారతాయి.

జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ ఫాల్( Hair Fall ) తో సతమతం అవుతున్న వారికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!