పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలు లోక సంరక్షణార్ధం పాపులను సంహరించి ధర్మాన్ని కాపాడటం కోసం వివిధ అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కృష్ణుడు తన ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు అవతారం ఎత్తారు.
ఈ క్రమంలోనే శ్రావణ మాస శుక్ల పక్షం అష్టమి తిథి రోజు విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో వసుదేవుడు, దేవకి దంపతులకు జన్మించారు.అసలు విష్ణుమూర్తి కృష్ణ అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? ఎందుకోసం కృష్ణావతారంలో భూమిపై జన్మించ వలసి వచ్చింది అనే విషయానికి వస్తే.
కంసుడు అనే రాజు బలవంతంగా తన తండ్రి నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకొని పరిపాలించేవాడు.ఈక్రమంలోనే కంసుడు నరకాసురుడు, బాణాసురుడు మాటలకు ప్రభావితమవుతాడు.నరకాసురుడు బాణాసురుడు రాక్షసులు అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కంసుడు సోదరి దేవకికి, వసుదేవుడికి వివాహం జరిపించి కంసుడు స్వయంగా రథసారథిగా మారి వారిని అత్తవారింటికి సాగనంపుతున్న క్రమంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది.
ఈ క్రమంలోనే ఆకాశం నుంచి ఓ కంసా! నీ సోదరి వివాహం తరువాత ఎంతో సంతోషంగా ఆమెను సాగనంపుతున్నావు.అయితే ఆమెకు పుట్టే ఎనిమిదవ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుందని భవిష్యవాణి చెప్పడంతో ఎంతో ఆగ్రహం చెందిన కంసుడు తన సంతానం వల్ల నాకు మరణమా.
అనుకొని భావించి తన చెల్లిని హతమారిస్తే తన సంతానంతో తనకు మరణం ఉండదని భావించాడు.

ఈ విధంగా తమ సంతానం వల్ల మరణం సంభవిస్తుందని సోదరిని చంపాలని భావించిన కంసునితో వసుదేవుడు వేడుకోవడంతో వారిని మధురలో చెరసాలలో పెట్టి బంధిస్తాడు.ఈ క్రమంలోనే వారికి సంతానం పుట్టగానే కాపలా వ్యక్తులు ఆ విషయాన్ని చేరవేయడం కంసుడు వచ్చి వారిని చంపడం జరుగుతుంది.అయితే 8వ సారి గర్భం దాల్చిన దేవకి పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది.
అయితే ఆ సమయంలో చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి.కాపలా వ్యక్తులు మత్తులోకి వెళ్లిపోవడంతో ఆ బిడ్డను తీసుకుని వసుదేవుడు గోకులంలోని నందుని భార్య యశోధర దగ్గర వదిలి తనకు పుట్టిన సంతానం ఆడబిడ్డను తీసుకువచ్చి మధురలో దేవకి చెంత ఉంచుతాడు.
ఈ క్రమంలోనే ఆ బిడ్డ ఏడుపుతో మెలకువలోకి వచ్చిన కాపలా వ్యక్తులు దేవకికి ఆడబిడ్డ అష్టమ సంతానంగా పుట్టిందని కంసుడికి చెప్పడంతో కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించగా తను గాలిలోకి ఎగిరి కంసా నిన్ను చంపే వాడు ఎక్కడో లేడు.గోకులంలో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది.
ఈ విధంగా కన్నయ్య ఒక రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ గోకులంలో గోవుల కాపరిగా పెరిగి చివరికి కంసుడిని సంహరిస్తాడు.ఈ విధంగా కంసుడిని చంపడం కోసమే శ్రీకృష్ణుడు అవతారంలో విష్ణుమూర్తి జన్మించాడు.