సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి.
ఆ రెండు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ అయి నిరాశ పరిచాయి కానీ బుల్లి తెర పై రెండు సినిమాలు సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దాదాపు పుష్కర కాలంగా వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు వీరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.దాంతో అభిమానులు అంతా కూడా సంతోషంగా ఉన్నారు.
గత ఏడాదిలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభమై ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కానీ గత రెండేళ్లుగా కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలా సినిమా లు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన విషయం తెలిసిందే.
అందుకే మహేష్ బాబు, త్రివిక్రమ్ ల సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.ఇటీవలే అభిమానుల కోరిక మేరకు సినిమా షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఎట్టకేలకు సినిమా పూజా కార్యక్రమాలు జరుగడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు.ఈ సమయంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా పూజా హెగ్డే మాత్రమే కాకుండా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి.కానీ ఆమె ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ వచ్చింది.ఇదే సమయంలో సినిమా ను మార్చి నెలలోనే పట్టాలెక్కించి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.ఆ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళి సినిమా ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.షూటింగ్ ఆలస్యమైన ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయమంటూ త్రివిక్రమ్ ఇటీవలే మహేష్ బాబు అభిమానులకు హామీ ఇచ్చాడు.







