తెలంగాణ సీఎం కేసీఆర్ అవకాశం దొరికినప్పుడల్లా ఏపీపై విరుచుకుపడడం.తద్వారా రాజకీయ లబ్ధి పొందడం పరిపాటిగా మారింది.
కేసీర్ మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలకే కేంద్రంగా ఉంటున్నాడనడంలో సందేహం లేదు.తాజాగా మరోసారి అదే సెంటిమెంట్‌తో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు ఆంధ్రపాలకుల వల్లే తెలంగాణ అభివృద్ది కుంటుపడిందని మండిపడ్డారు.నేడు కేసీఆర్ మెడకు ఉచ్చులా మారిన నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేందుకు ఏపీపై కామెంట్లు చేశారు.
తెలంగాణంలో నిరుద్యోగ సమస్యకు ఏపీనే కారణం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇది చర్చణీయాంశంగా మారింది.
ఉద్యోగుల విషయంలో ఏపీది అర్థం లేని వాదన అంటూ విరుచుకుపడ్డారు.ఉద్యోగుల విభజనపై కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు.
విద్యుత్ ఉద్యోగుల సమస్యపై సుప్రీం కోర్టుకు వెళ్లిందని, నియామాకాలపై వివాదాలు సృష్టిస్తోందంటూ చెప్పుకొచ్చారు.తద్వారా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయామంటూ దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
తెలంగాణ ఆస్తుల విషయంలోనూ వివాదాలు నెలకొల్పుతూ ఆర్టీసీ ఆస్ప్రతుల్లో వాటా కోరుతున్నారని వ్యాఖ్యానించారు.వీటిని కేంద్రం పరిష్కరించకుండా చోద్యం చూస్తోందన్నారు.
తెలంగాణకు నీటి వాటా కోసం పోరాటం చేస్తున్నట్టు వెల్లడించారు.ప్రస్తుతం విద్యుత్, నీటి సమస్యను అధిగమించామన్నారు.
అయితే రాష్ట్రంలో పండిన పంటలను కేంద్రం కొనమంటూ చేతులెత్తేసిందని అన్నారు.

స్వరాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ నేతలపై నమోదైన రైల్వే కేసులు నేటివరకు ఉన్నాయన్నారు.తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ భాష అంటే నాడు హాస్యాస్పదంగా ఉండేదని, నేడు తెలంగాన భాష పెడితేనే సినిమా హిట్ అవుతోందని చెప్పారు.అలాగే సమ్మక్క-సారలమ్మ జాతర, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుతున్నామన్నారు.
ఇలా తెలంగాణ ఉనికిని చాటుతూనే అభివృద్ధిలో ఏపీ కొర్రీలు పెడుతుందంటూ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీస్తోంది.వచ్చే ఎన్నికల వేల రాజకీయ లబ్ధి పొందేందుకే మరోసారి సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.








