డైరెక్టర్ తేజ గురించి మనం డైలీ ఎదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం.గత ఆర్టికల్స్ లో తేజ మైండ్ సెట్ పైన ఆయన సినిమాల పైనే అనేక విషయాలను వెల్లడించాం.
ఇక ఆర్జీవీ మరియు తేజ కలిసి ముంబై లో సినిమాలకు పని చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.డైరెక్టర్ గా మారక ముందు తేజ కెమెరా మెన్ గా పని చేసాడు అన్న విషయం మన అందరికి తెలిసిందే.
వాస్తవానికి మద్రాసు లో మహీధర్ గారి దగ్గర తేజ అసిస్టెంట్ కెమెరా మ్యాన్ గా తొలినాళ్లలో పని చేసేవాడు.అయన పని చేస్తున్న రావు గారిల్లు సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక కుర్రాడు పని చేసేవాడు.
ఆ కుర్రాడు రామ్ గోపాల్ వర్మ.ఇక లైటమెన్స్, ప్రొడక్షన్ బాయ్స్ అందరిని కూర్చోపెట్టుకొని తేజ తనకు తెలిసిన, వచ్చిన పిట్ట కథలు చెప్పేవాడు.ఆలా అర్జీవి మరియు తేజ స్నేహితులు అయ్యారు.అప్పటికే ఆర్జీవీ కి డైరెక్షన్ చేయాలనీ ఉండేది.
దాంతో ఇద్దరు కలిసి అక్కడ నుంచి హైదరాబాద్ కి వచ్చి శివ సినిమా స్క్రిప్ట్ రాసారు.మొదటి సినిమాతో తేజ ను కెమెరా మెన్ గా అనుకున్న కూడా ఎందుకో కొంచం ఆలోచింది గోపాల్ రెడ్డి తో చేయించాడు.
ఆ తర్వాత మూడు సినిమాలకు కూడా వర్మ తేజ కి కెమెరా మెన్ ఛాన్స్ ఇవ్వలేదు కానీ రాత్రి అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ అయ్యాడు.ఇక దాంతో అయన పని తనం నచ్చి అమీర్ ఖాన్ ముంబై రమ్మన్నాడు.
అక్కడ తేజ కెమెరా మెన్ గా పని చేస్తున్న ఒక సినిమా కోసం ఎయిర్పోర్ట్ లో షూటింగ్ జరుగుతుండగా, ప్రొడ్యూసర్ ఒక లారీ నిండా లైట్స్ తెప్పించాడు.కానీ తేజ రెండు టార్చ్ లైట్స్ మాత్రం చాలు అంటూ అన్ని వెనక్కి పంపించేశాడు.ఇంత పెద్ద షూట్ లైట్స్ లేకుండా ఎలా తీస్తావ్ అని చెప్పిన నేను తీస్తాను అంటూ సాహసం చేసి అద్భుతంగా తీసాడు.తెల్లవారి ఈ విషయం ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది.
ఇక మరుసటి రోజు షూట్ జరుగుతుంటే అద్దాల్లోంచి కొన్ని తలలు మాత్రమే కనిపిస్తిన్నయి.
స్టూడియో ముందు ఇరవై కి పైగా కార్లు .ఎవరా అని చూస్తే ముంబై నిర్మాతలు.హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రాడు లైట్స్ లేకుండా ఎలా సినిమా షూట్ చేస్తున్నాడో అని తెలుసుకోవడానికి ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు.
ఆలా ముప్పై కి పైగా సినిమాల్లో కెమెరా మెన్ గా పని చేసి ఆ తర్వాత డైరెక్షన్ స్టార్ట్ చేసాడు.ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ.