ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో నాజూగ్గా మారుతుంది!

చాలామంది తమ పొట్ట లావుగా ఉందని ఎంతగానో వర్రీ అయిపోతుంటారు.ముఖ్యంగా మహిళలకు ప్రెగ్నెన్సీ కారణంగా పొట్ట లావుగా మారుతుంటుంది.

 Drinking This Water On An Empty Stomach Belly Fat Will Go Away Details! Coriande-TeluguStop.com

అలాగే పురుషుల్లో గంటలు తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.అంతేకాదు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం తదితర కారణాల వల్ల సైతం బాన పొట్ట ఏర్పడుతుంటుంది.

అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే నెల రోజుల్లోనే బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.మ‌రి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక అర కట్ట కొత్తిమీర ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Belly Fat, Corander, Coriander, Fat Cutter, Tips, Latest-Telugu Health

కొత్తిమీర వాటర్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట‌ నాజుగ్గా మారుతుంది.అంతేకాదండోయ్ కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు కొత్తిమీర వాటర్ సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.

మధుమేహం ఉన్నవారు కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Telugu Belly Fat, Corander, Coriander, Fat Cutter, Tips, Latest-Telugu Health

అలాగే కొత్తిమీర వాటర్ ను తాగడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల నొప్పులు, మౌత్ అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కొత్తిమీర వాటర్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

ఉబ్బ‌రం, గ్యాస్‌, మలబద్ధకం, అజీర్తి తదితర జీర్ణ సంబంధిత సమస్యలను సైతం కొత్తిమీర వాటర్ తో దూరం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube