నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఎమోషనల్ పోస్ట్.. అలా ఉన్నావంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు నమ్రత జోడీ కూడా ఒకటి.నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Mahesh Emotional Post About Namratha Details, Mahesh, Namratha, Namratha Shirodh-TeluguStop.com

నమ్రత శిరోద్కర్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మహేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.కుటుంబంను నమ్రత సక్రమంగా చూసుకుంటున్నారని మహేష్ వెల్లడించారు.

నా ఎదుగుదలకు నమ్రత సహాయం చేస్తోందని మహేష్ చెప్పుకొచ్చారు.

నమ్రత నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్ అని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్ గా మహేష్ నమ్రత వార్తల్లో నిలవడం గమనార్హం.ఈరోజు నమ్రత పుట్టినరోజు కావడంతో నమ్రత ఫ్యాన్స్ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మహేష్ చేసిన ట్వీట్ కు కేవలం రెండు గంటల్లోనే 30,000 కంటే ఎక్కువ మొత్తం లైక్స్ రావడం గమనార్హం.

2005 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన మహేష్ నమ్రతల వివాహం జరగగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జోడీ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు.సినిమాలతో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా మహేష్ ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొంటున్న మహేష్ ఆరు నెలల్లో ఈ సినిమా షూట్ ను పూర్తి చేయాలని షరతు విధించారని బోగట్టా.

గతంలో బిజినెస్ మేన్ సినిమా షూటింగ్ ను కూడా మహేష్ ఇదే విధంగా వేగంగా పూర్తి చేశారని సమాచారం అందుతోంది.మహేష్ సినిమాలలో నమ్రత నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపించడం లేదు.మహేష్ నమ్రత ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.మహేష్ నమ్రత ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube