నీరసం( Fatigue ) దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దీన్ని ఫేస్ చేసే ఉంటారు.ఎప్పుడో ఒకసారి పలకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ కొందరు నిత్యం నీరసంతో బాధపడుతుంటారు.కంటి నిండా నిద్ర లేకపోవడం, ఎక్కువగా నిద్ర పోవడం, అధికంగా వ్యాయామం చేయడం, మద్యపానం, ఆహారపు అలవాట్లు, రక్తహీనత తదితర కారణాల వల్ల నీరసం వేధిస్తూ ఉంటుంది.
నీరసం అనేది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.నీరసం శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
ఏ పని చేయలేకపోతుంటారు.ఎప్పుడు డల్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే నీరసం పోవడానికి మందులు వాడుతుంటారు.కానీ సహజంగా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.ఇది నీరసాన్ని వదిలించి శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం నీరసాన్ని తరిమికొట్టే ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బీట్ రూట్( Beetroot ) ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

ఈ విధంగా బీట్ రూట్ జ్యూస్( Beetroot Juice ) ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా ఈ జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్ తో సహా ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటాయి.రోజు ఉదయం ఒక గ్లాసు చొప్పున ఈ జ్యూస్ తీసుకుంటే కనుక నీరసం, అలసట పరార్ అవుతాయి.శరీరం శక్తివంతంగా మారుతుంది.రక్తహీనత ఉంటే దూరం అవుతుంది.ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.
అంతేకాదు ఈ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.లివర్ సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.
అలాగే నిత్యం ఈ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
మరియు చర్మం నిగారింపుగా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా రాకుండా ఉంటాయి.