మెంతులువీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.అందరి వంటింట్లో ఉండే వంట దినుసుల్లో మెంతులు ఒకటి.
రుచిలో చేదుగా ఉన్నప్పటికీ మెంతుల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా బోలెడన్ని పోషక విలువలు దాగి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా మహిళలు తరచూ మెంతులను తీసుకుంటే.ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో నడుము నొప్పి, కాళ్ల నొప్పి, తల నొప్పి, కడుపు నొప్పి ఇలా అనేక నొప్పులతో బాధ పడుతుంటారు.
అయితే ఈ సమయంలో మెంతులను పొడి చేసి ఆ పొడిని గోరు వెచ్చటి నీటితో కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే ఎటువంటి నొప్పులైనా పరార్ అవుతాయి.
ప్రసవం తర్వాత మహిళలు మెంతులను ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.ఇలా చేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది.అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ మెంతులను తీసుకోవచ్చు.గర్భిణీలు మెంతులను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది.మరియు గర్భాశయ సంకోచ వ్యాకోచాలు నియంత్రించబడతాయి.
ఇక పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే రక్త హీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే రక్త హీనతను నివారించడంలోనూ మెంతులు ఉపయోగపడతాయి.మెంతులను ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది.
మెంతులు అధిక బరువును తగ్గించడంలోనూ సహాయపడతాయి.ఓవర్ వెయిట్‌తో ఇబ్బంది పడే మహిళలు.ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ మెంతి పొడి వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి.అనంతరం ఆ నీటిలో తేనె కలిపి తీసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే క్రమంగా వెయిట్ లాస్ అవుతాయి.