గతేడాది థియేటర్లలో విడుదలై అంచనాలకు మించి విజయం సాధించిన సినిమాలలో కల్కి( Kalki ) ఒకటి.బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు అంచనాలకు మించి లాభాలు వచ్చాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాతో ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు.కల్కి సీక్వెల్( Kalki Sequel ) కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగ ఎదురుచూస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
కల్కి సీక్వెల్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారని నాగ్ అశ్విన్ ను ప్రశ్నించగా కల్కిని మూడు, నాలుగు గ్రహాలు ఒకే వరసలో ఉన్న సమయంలో రిలీజ్ చేశానని కల్కి సీక్వెల్ ను 7, 8 గ్రహాలు ఒకే వరసలోకి వచ్చిన సమయంలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.వేచి ఉండండి అని నాగ్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
కల్కి సీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కల్కి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని భోగట్టా.ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.కల్కి సీక్వెల్ లో ప్రభాస్( Prabhas ) కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని భైరవ, కర్ణ యాంగిల్ లో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.
కల్కి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కల్కి సీక్వెల్ లో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని ప్రభాస్ రేంజ్ ను మార్చేసి సినిమా ఈ సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.