ఏపీలో తొలిసారిగా 600కు 600 మార్కులు.. నేహాంజని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు( AP SSC Results ) విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే.తాజాగా విడుదలైన ఫలితాల్లో కాకినాడ( Kakinada ) విద్యార్థిని నేహాంజని( Nehanjani ) అరుదైన రికార్డ్ సృష్టించింది.

 Ap State Topper Nehanjani Inspirational Success Story Details, Ap Ssc Results, Y-TeluguStop.com

కాకినాడలోని ప్రముఖ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థిని సాధించిన రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.న భూతో న భవిష్యత్ రికార్డ్ సాధించిన నేహాంజనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

నేహాంజనికి సంబంధించిన మార్క్ లిస్ట్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఈమె సాధించిన విజయం చూసి తల్లీదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, పాఠశాల యాజమాన్యం ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Telugu Andhra Pradesh, Ap Ssc, Ap Ssc Topper, Apssc, Ap Tenth Class, Kakinada, N

ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.పదో తరగతి పరీక్షలలో నేహాంజని ఒక విధంగా సంచలనం సృష్టించారని చెప్పవచ్చు.ఎంతో కష్ట్పడితే తప్ప ఈ స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోవడం సాధ్యం కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Telugu Andhra Pradesh, Ap Ssc, Ap Ssc Topper, Apssc, Ap Tenth Class, Kakinada, N

మే నెల 19వ తేదీ నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్నాయని సమాచారం అందుతోంది.పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని 600 మార్కులకు 598 మార్కులు సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.వేర్వేరు వెబ్ సైట్ల ద్వారా పదో తరగతి ఫలితాలను సులువుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంది.

రోజుకు 9 గంటల పాటు నేను ప్రిపేర్ అయ్యానని ఆమె అన్నారు.ఐఐటీ బాంబేలో చదివి సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని నేహాంజని తెలిపారు.తల్లీదండ్రుల ప్రోత్సాహం వల్లే నేహాంజని సక్సెస్ సాధించారని సమాచారం అందుతోంది.నేహాంజని భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube