ఇటీవల రోజుల్లో గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, ఊబకాయం వంటి రకరకాల కారణాల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాలకు అడ్డుపడి గుండె పోటుకి దారితీస్తుంది.అందుకే గుండెను భద్రంగా ఉంచుకోవాలనుకుంటే బ్యాడ్ కలెస్ట్రాల్‌ను కరిగించుకోవడం ఎంతో ముఖ్యం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.మరి లేటెందుకు ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండీ.
అవకాడో పండు. ధర ఎక్కువే అయినా అందుకు తగ్గా పోషకాలు అందులో పుష్కలంగా నిండి ఉంటాయి.అవకాడోలో ఆరోగ్యవంతమైన మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా నిండి ఉంటాయి.అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.ఫలితంగా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

అలాగే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా గుండెను భద్రంగా కాపాడే సామర్థ్యం బొప్పాయికి ఉంది.బొప్పాయి పండును తరచూ తీసుకుంటే విటమిన్స్, మినరల్స్, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యాపిల్ పండు.
అధికంగా పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.రోజుకు ఒక యాపిల్ పండును తింటే గుండె పోటే కాదు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక ద్రాక్ష పండ్లు.తక్కువ ధరకే లభించినా పోషకాలు మాత్రం ఎక్కువగా కలిగి ఉంటాయి.వీటిని తరచూ తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం పెరుగుతుంది.రక్తపోటు స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి.
కాబట్టి, మీ గుండె క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన నాలుగు రకాల పండ్లను తప్పకుండా డైట్లో చేర్చుకోండి.







